waltair veerayya Movie Review: మెగాస్టార్ చిరంజీవి హీరోగా, యువ దర్శకుడు బాబీ దర్శకత్వంలో తిరకేక్కుతున్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. ముఠామేస్త్రి తరహాలో చిరంజీవి పూర్తిస్థాయి మాస్ పాత్రలో నటిస్తున్న చిత్రం కావడంతో అంచనాలు పెరిగాయి. పైగా మాస్ మహారాజ రవితేజ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Advertisement
waltair-verayya-review
ఈ తరుణంలో వాల్తేరు వీరయ్య మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ఓవర్సీస్ సెన్సార్ సభ్యుడు, ఫిల్మ్ క్రిటిక్ ఉమర్ సందు వాల్తేరు వీరయ్య చిత్రంపై షార్ట్ రివ్యూ ఇచ్చాడు. సినిమా ఎలా ఉందో తన అభిప్రాయం తెలియజేశారు. కాగా వాల్తేరు వీరయ్య చిత్రానికి ఉమర్ సందు రివ్యూ చాలా నిరాశజనకంగా ఉంది. కనీసం యావరేజ్ మార్క్స్ కూడా వేయలేదు. ఆయన డిజాస్టర్ అని కామెంట్ చేయడం భయపెడుతుంది. చిరంజీవి గారు దయచేసి ఇలాంటి రొమాంటిక్ రోల్స్ చేయడం మానేసి, సీరియస్ రోల్స్ చేస్తే బెటర్. మిమ్మల్ని ఆ తరహా పాత్రలో చూసి బోర్ కొట్టేసింది.
Advertisement
వాల్తేరు వీరయ్య చిరంజీవికి మరో డిజాస్టర్ కానుంది, అని ట్వీట్ చేశారు. రొటీన్ కమర్షియల్, రొమాంటిక్ రోల్స్ కాకుండా ఏదైనా కొత్తగా ట్రై చేయండి. వాల్తేరు వీరయ్య మూవీలో ఎలాంటి కొత్తదనం లేదు. ఆకట్టుకోలేదని పరోక్షంగా ఉమర్ సందు తన ట్వీట్ ద్వారా తెలియజేశారు. ఉమర్ సందు రివ్యూ తీవ్రంగా అభిమానులను నిరాశపరిచేదిగా ఉంది. చిరంజీవి గత గాడ్ ఫాదర్ కు కూడా ఉమర్ సందు నెగిటివ్ రివ్యూ ఇచ్చారు. అతను చెప్పిన విధంగానే గాడ్ ఫాదర్ పెద్ద హిట్ కాలేదు. వాల్తేరు వీరయ్య సినిమా కూడా పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేదని కామెంట్ చేశారు. ఇది ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణమైంది. అయితే ఉమర్ సందు రివ్యూస్ లో కచ్చితత్వం ఉంది. కానీ ఈ రివ్యూ ని మెగా ఫ్యాన్స్ పెద్దగా పట్టించుకోవడం లేదు.
Advertisement
Read also : వారిని నమ్మి రూ. 21 లక్షలు పోగొట్టుకున్న జబర్ధస్థ్ వినోద్..నరకయాతనలో కమెడియన్ !