టాలీవుడ్ ఇండస్ట్రీలో కోటశ్రీనివాసరావు పాత్ర గురించి ఎంత చెప్పిన తక్కువే. వందల సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఆయన. ప్రస్తుతం సినిమాల్లో అంతగా కనిపించడం లేదు. కేవలం ఇంటికే పరిమితమైన ఆయన తాజాగా యూట్యూబ్ ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి పై సంచలన వ్యాఖ్యలు చేసారు. చిరంజీవి ఆసుపత్రి కడతానన్నారనే విషయం ఆయన దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
Advertisement
బ్యాంకు ఉద్యోగిగా స్థిరపడిన కోట శ్రీనివాసరావు నటన మీద మమకారంతో నాటకాలు వేస్తుండేవాడు. ప్రాణం ఖరీదు అనే ఓ నాటకం సినిమాగా రూపుదిద్దుకున్న తరుణంలో ఆయనకు అదే సినిమాలో చిన్న వచ్చింది. ఆ తరువాత ఆయన ఒక పక్క బ్యాంకు ఉద్యోగం చేసుకుంటూ మరోపక్క సినిమాల్లో అవకాశాల కోసం తిరుగుతుండేవాడు. అనూహ్యంగా సూపర్ స్టార్ కృష్ణ ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చాక మండలాధీశుడు అనే చిత్రంలో నటించారు. మండలాధీశుడులో ఎన్టీఆర్‌ను పోలి ఉన్న ఓ పాత్రలో కోట శ్రీనివాసరావు నటించారు. ఇక ఆ తరువాత కృష్ణ నటించిన అన్ని సినిమాల్లో దాదాపు అవకాశాలు ఇవ్వడం ప్రారంభించారు. కోట శ్రీనివాసరావు ప్రస్థానం అలా మొదలైంది.
Advertisement
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మే డే సందర్భంగా ఇటీవలే వేడుకలు జరిగాయి. సినీ కార్మికుల కోసం చిత్రపురిలో ఆసుపత్రి కట్టిస్తానని చిరంజీవి ముందుకు వచ్చారని తలసాని ప్రకటించారు. తాజాగా దీనిపై కోట శ్రీనివాసరావు స్పందించారు. కార్మికులకు ముందు ఫుడ్ పెట్టాలి, అది లేక ఇబ్బందులు పడుతుంటే కట్టే ఆసుపత్రికి ఎవరు వస్తారని ప్రశ్నించారు. ప్రతిభ ఉండి కూడా ఎంతో మంది పని లేక కృష్ణానగర్‌లో ఆకలితో అలమటించడమే కాకుండా వ్యసనాల బారిన పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని కోటా పేర్కొన్నారు. కార్మికుల దగ్గర డబ్బులు ఉంటే అపోలో ఆసుపత్రికి వెళతారన్న ఆయన చిరంజీవి కట్టే ఆసుపత్రికి ఎందుకు వెళ్తారని వ్యాఖ్యానించారు. కోట్ల రూపాయల పారితోషికం తీసుకునే చిరంజీవి సినీ కార్మికుడు ఎలా అవుతారంటూ కోటా ప్రశ్నించారు. ఈ మాటలు తనకు నచ్చలేదన్న ఆయన చిరంజీవి అంటే ఎంతో గౌరవం అని చెప్పుకొచ్చారు.
Also Read :
బాలకృష్ణ కూతురుగా నటించనున్న ఆ యంగ్ హీరోయిన్..!
“ఛత్రపతి” సూరీడు గుర్తున్నాడా..? ఇప్పుడు ఎలా ఉన్నాడు..ఏం చేస్తున్నాడో తెలుసా…!