Home » యాంకర్ అనసూయ పై సెటైర్స్ వేసిన కోట శ్రీనివాసరావు ..! జబర్దస్త్ షో లాంటి పనులు అవసరమా అంటూ ..!

యాంకర్ అనసూయ పై సెటైర్స్ వేసిన కోట శ్రీనివాసరావు ..! జబర్దస్త్ షో లాంటి పనులు అవసరమా అంటూ ..!

by Azhar
Ad
జబర్దస్త్ షో మన తెలుగు రాష్ట్రాల్లో ఎంతగా ప్రసిద్ధి చెందిందో అందరికి తెలిసిన విషయమే. ఈ షో ఎంతో మంది కళాకారులను టాలీవుడ్ కు పరిచయం చేసింది. ఈ షో ద్వారా ఎంతో మంది మంచి పేరు కూడా సంపాదించుకున్నారు. అందులో యాంకర్ అనసూయ కూడా ఒక్కరు. ఎప్పటి నుండో ఇండస్ట్రీలో ఉన్న అనసూయకు ఈ షో ద్వారానే మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత సినిమాల్ ఆవేశాలు కూడా రావడం ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ఆమె కూడా పెద్ద పెద్ద సినిమాల్లో అవకాశాలు కొట్టేస్తుంది.
ఇటువంటి అనసూయ జబర్దస్త్ షోలో వేసే డ్రెస్సులు పైన టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు సెటైర్స్ వేశారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జబర్దస్త్ చూసినప్పుడు మీకు ఏం అనిపిస్తుంది అని అడిగిన ప్రశ్నకు కోట శ్రీనివాసరావు సమాధానం ఇస్తూ.. అందులో పెద్దగా ఏం ఉంది. ఏం లేదు. నాలుగైదు మాటలు తప్ప. అలాగే ఈ షోలో యాంకర్ అనసూయ వేసుకునే డ్రెస్సులు కూడా నాకు నచ్చవు. అనసూయ మంచి నటి, డ్యాన్సట్ కూడా.

అలాగే ఆమె ఇప్పుడు సినిమాల్లో మంచి పాత్రలు చేస్తుంది. కానీ ఆ షోలో ఆమె వేసుకునే డ్రెస్సులు చూసినప్పుడు మాత్రం నాకు అసలు నచ్చదు అని ఆయన తెలిపారు. అందులో ఈ ఏదో ఈ డ్రెస్సులు, నాలుగు మాటలు ఉంటాయి. ఏదో అలా నడుస్తుంది ఆ  షో అని కోట శ్రీనివాసరావు అన్నారు. అయితే ఇప్పుడు ఈ జబర్దస్త్ షో అనేది ముగింపు దశకు వచ్చినట్లు కనిపిస్తుంది. 2013 నుండి ఈ ఏడాది వరకు చాలా విజయవంతంగా నడిచిన ఈ షో నుండి ఒక్కేసారి బాగా పాపులర్ అయిన కామెడియన్లతో పాటుగా జడ్జ్ గా ఈ షోను నడిపించిన రోజా కూడా వెళ్లిపోవడంతో దీని రేటింగ్ పడిపోయాయి. అందుకే ఇప్పుడు ఈ షో చివరి రోజుల్లో ఉన్నట్లు తెలుస్తుంది.

Advertisement

Advertisement

ఇవి కూడా చదవండి :

నేను ఇలా ఉండటానికి కారణం ఆ జట్టే అంటున్న ధోని..!

2008 లోనే రిటైర్ అవుదాం అనుకున్న సెహ్వాగ్ ను అడ్డుకున్న సచిన్..!

Visitors Are Also Reading