Home » ఎన్టీఆర్ తర్వాత మరో నందమూరి హీరోతో కొరటాల..!

ఎన్టీఆర్ తర్వాత మరో నందమూరి హీరోతో కొరటాల..!

by Azhar
టాలీవుడ్ లోని టాప్ డైరెక్టర్లలో కొరటాల శివ ఒక్కడు అనే విషయం తెలిసిందే. ఈయన ఇప్పటివరకు తీసిన సినిమాలు కొన్నే అయిన.. వాటితో గుర్తింపు అనేది బాగానే తెచ్చుకున్నారు. కానీ చివరగా ఈయన చిరంజీవితో తీసిన సినిమా అనేది బెడిసి కొట్టింది. చిరు, రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య అనే సినిమా కొరటాల డైరెక్షన్ లో వచ్చి అట్టర్ ప్లాప్ అయ్యింది.
అందువల్ల కొరటాలకు కష్టాలు తప్పలేదు అనే చెప్పాలి. అయితే ప్రస్తుతం కొరటాల ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. కానీ ఆ సినిమాను ఇంకా సెట్స్ పైకి మాత్రం తీసుకెళళ్లేదు. అందువల్ల నందమూరి ఫ్యాన్స్ అందరూ కొరటాల ఎప్పుడు సినిమా ప్రారంభిస్తాడు అని ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కొరటాల కొత్త సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు అనేవి తెరపైకి వస్తున్నాయి.
అవేంటంటే.. ఎన్టీఆర్ తో సినిమా ముగించిన తర్వాత కొరటాల మళ్ళీ మరో నందమూరి హీరోతోనే సినిమా అనేది చేయనున్నాడు అని తెలుస్తుంది. ఇప్పుడు అబ్బాయితో చేస్తున్న కొరటాల తర్వాత బాబాయ్తో చేసే విధంగా సితార ఎంటర్టైన్మెంట్స్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే బాలయ్య, కొరటాల సితార ఎంటర్టైన్మెంట్స్ కు ఒక్కో సినిమా కమిట్ అయ్యారట. అందుకే వీరి కాంబినేషన్ లో సినిమా తెస్తే బాగుంటుంది అని సితార ఎంటర్టైన్మెంట్స్ భావిస్తున్నట్లు సమాచారం. చూడాలి మరి ఈ కాంబినేషన్ లో సినిమా ఎప్పటికి వస్తుంది అనేది.
Visitors Are Also Reading