Home » సాహా ఫుడ్ కాంబినేషన్ ఓ వింత అంటున్న కోహ్లీ..!

సాహా ఫుడ్ కాంబినేషన్ ఓ వింత అంటున్న కోహ్లీ..!

by Azhar
ఫుడ్ విషయంలో ఒక్కొక్కరిది ఒక్కో అలవాటు అనేది ఉంటుంది. అందుకే పుర్రె కో బుద్ధి.. జిహ్వకో రుచి అనే సామెత ఉంది. అయితే ఈ ఆహారపు అలవాట్లు.. వారు తినే ఫుడ్ కాంబినేషన్ అనేది ఎవరి ఇష్టంగా వారికీ ఉంటుంది. అయితే భారత క్రికెట్ జట్టులోని సీనియర్ వికెట్ కీపర్ అయిన వృద్ధిమాన్ సాహా యొక్క ఫుడ్ కాంబినేషన్ అనేది ఓ వింత అని విరాట్ అన్నారు.
తాజాగా విరాట్ మాట్లాడుతూ.. కొత్త కొత్త.. వింత వింత ఫుడ్ కాంబినేషన్ అనేది ట్రై చేయాలి అంటే సాహా వల్లే అవుతుంది అని చెప్పాడు. సాహా… చికెన్, రోటీ, సలాడ్‌తో కలిపి రసగుల్లాను తింటాడు. ఇది ఏం కాంబినేషన్ అని నేను అంటే… నాకు ఇలానే అలవారు అన్నాడు. అంతే కాదు.. సాహా అన్నంతో ఐస్‌క్రీమ్ తింటాడు. ఇంకా నేను ఆశ్చర్యపోయింది ఎక్కడ అంటే.. ఐస్‌క్రీమ్ లో పప్పు వేసుకొని తింటున్నాడు అని కోహ్లీ అన్నాడు.
అలాంటి సమయంలో ఈ కొత్తదనం ఆటలో చూపిస్తే అయిపోతుంది కదా అని నాకు అనిపిస్తుంది అని కోహ్లీ అన్నాడు. ఇక తాను ఇప్పటివరకు లైఫ్ లో బెస్ట్ ఫుడ్ అనేది భూటాన్ లో తిన్నాను అని విరాట్ చెప్పాడు. అక్కడ దొరికి సహజ సిద్ధమైన పండ్లు, కూరగాయలు అనేవి చాలా బాగా ఉంటాయి అని విరాట్ కోగలి చెప్పాడు. ఇక ప్రస్తుతం విరాట్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.
Visitors Are Also Reading