Home » Kirrak RP : నెల్లూరు చేపల పులుసును నెలరోజుల్లోనే బంద్ చేసిన జబర్దస్త్ కమెడియన్..

Kirrak RP : నెల్లూరు చేపల పులుసును నెలరోజుల్లోనే బంద్ చేసిన జబర్దస్త్ కమెడియన్..

by Bunty
Ad

కిరాక్ ఆర్పి గురించి తెలియని వారు ఉండరు. ఇటీవలే తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పి కర్రీ పాయింట్ బిజినెస్ మొదలుపెట్టాడు. కూకట్పల్లిలో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరిట కర్రీ పాయింట్ ప్రారంభించాడు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే చేపల పులుసు, బొమ్మిడాయిల పులుసు, కొరమీను పులుసు, సన్న చేపల పులుసు, రవ్వ చేపల పులుసు, చేప తలకాయ పులుసు ఇలా అన్ని కట్టెల పొయ్యి మీదనే వండుతారట. అయితే నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కర్రీ పాయింట్ ద్వారా ఆర్పి బాగానే సంపాదిస్తున్నాడు. కిరాక్ ఆర్పికి ఒక రోజుకు ఆదాయం రెండు లక్షలు వస్తుందట.

Advertisement

ఇది ఇలా ఉండగా, ఈ షాపు నెలరోజుల పాటు మూసి వేస్తున్నట్లుగా తాజాగా కిరాక్ పార్టీ ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. తన షాప్ కి వచ్చే వాళ్లందరికీ తగిన ఐటమ్స్ అందించలేక చాలా ఇబ్బంది పడుతున్నారని ఆర్పి కొన్ని వీడియోలలో తెలియజేశారు. ఈ క్రమంలోనే కస్టమర్ల తాకిడి తట్టుకోలేక షాపును మూసివేసి పనివాళ్ళ కోసం నెల్లూరుకి వచ్చానని తెలియజేశారు. నెల్లూరులో చేపల పులుసు వండే వారితో పాటు హోటల్లో పని చేసే వారి కోసం వెతుకుతున్నట్లుగా సమాచారం.

Advertisement

చేపల పులుసు అద్భుతంగా చేసే వారికి తన దగ్గర ఉపాధి కల్పించడమే కాకుండా వారిని సొంత కుటుంబ సభ్యులుగా చూసుకుంటానని భరోసా కల్పిస్తానని తెలిపారు కిరాక్ ఆర్పి. నెల్లూరు మహిళలు చేపలు కడిగే పద్ధతి మిగతా వారి కంటే చాలా భిన్నంగా ఉంటుందని తెలియజేశారు. అలాగే కట్టెల పొయ్యి మీద చేసేటువంటి చేపల పులుసు కూడా రుచికి తగ్గట్టుగానే ఉంటుందని తెలిపారు. ఇక తన వ్యాపారానికి మంచి ఆదరణ లభిస్తూ ఉండడంతో మ్యాన్ పవర్ కొరత కారణంగా డిమాండ్ సరిపడా కస్టమర్లకు ఐటమ్స్ అందించలేకపోతున్నామని, దీంతో నిరాశగా వెళుతుంటే తనకు బాధగా ఉందని, త్వరలోనే నెల్లూరు నుంచి మంచి మాస్టర్లను తీసుకువచ్చి కర్రీ పాయింట్ తిరిగి ఓపెన్ చేస్తున్నానని తెలిపారు.

ఇవి కూడా చదవండి  : కొత్త సంవత్సరంలో కల్యాణ్‌ దేవ్‌ సంచలన పోస్ట్‌.. ఆ తప్పులు అంటూ !

Visitors Are Also Reading