Home » కొత్త సంవత్సరంలో కల్యాణ్‌ దేవ్‌ సంచలన పోస్ట్‌.. ఆ తప్పులు అంటూ !

కొత్త సంవత్సరంలో కల్యాణ్‌ దేవ్‌ సంచలన పోస్ట్‌.. ఆ తప్పులు అంటూ !

by Bunty

మెగా అల్లుడు కల్యాణ్ దేవ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన మూడేళ్ల కెరీర్ లో ఎప్పుడూ లేనంతగా ఈ మధ్యకాలంలో వార్తల్లో నిలుస్తున్నాడు మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్. మూడేళ్ల కింద చిరంజీవి కుటుంబం నుంచి ఒక కొత్త హీరో వచ్చాడు ఆయన పేరే కళ్యాణ్ దేవ్. చిరు చిన్న కూతురు శ్రీజ భర్త ఈయన.

పెళ్లి సమయంలోనే కళ్యాణ దేవ్ ను చూసి హీరో అవుతాడు అని అందరూ అనుకున్నారు.  అనుకున్నట్టుగానే 2018 లో విజేత సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ పెద్ద హీరో కాలేకపోయాడు. ఇది ఇలా ఉంటే, న్యూ ఇయర్ సందర్భంగా కళ్యాణ్ దేవ్ పెట్టిన మరో పోస్ట్ కూడా ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.

‘2022 లో చాలా నేర్చుకున్నాను. సహనంగా ఎలా ఉండాలో తెలిసి వచ్చింది. ఎదుగుదల అంటే ఏంటో తెలిసింది. అవకాశాలను అందుకోవడం, రిస్క్ తీసుకోవడం తెలుసుకున్నా. నా తప్పుల నుంచి ఎన్నో నేర్చుకున్నాను. ఇతరులను క్షమించడం, నాతో నేను ఎక్కువగా గడపడం ఇలా ఎన్నో నేర్చుకున్నాను. నా ఈ ప్రయాణంలో ఉండి, నన్ను నేను మార్చుకునేలా సాయపడ్డ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీ అందరి ప్రేమ ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ప్రయత్నించడం, ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు, మీ అందరికీ ప్రేమ, ఆరోగ్యం, ఆనందం, సాహసం, విజయం మీరు కోరుకునేది ప్రతిదీ ఉండాలని కోరుకుంటూ ఈ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు’ అని కళ్యాణ్ దేవ్ తన ఇన్స్టా ఖాతాలో రాసుకొచ్చాడు.

also read:

Visitors Are Also Reading