Home » 11న హిందీలోనూ విడుద‌ల‌కు రెడీ అవుతున్న ‘ఖిలాడి’

11న హిందీలోనూ విడుద‌ల‌కు రెడీ అవుతున్న ‘ఖిలాడి’

by Anji

మాస్ మ‌హారాజా ర‌వితేజ ద్విపాత్రాభిన‌యం చేస్తున్న చిత్రం ఖిలాడి. ఈనెల 11న ఈ సినిమా తెలుగుతో పాటు హిందీలో విడుద‌ల కానున్న‌ది. ఈ మూవీ నిర్మాణ భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రిస్తున్న పెన్ మూవీస్ సంస్థ దీన్నీ హిందీలో గ్రాండ్ వే రిలీజ్‌కు స‌న్నాహాలు చేస్తోంది. దానికి సంబంధించిన పోస్ట‌ర్‌ను శ‌నివారం విడుద‌ల చేసింది. ఇదిలా ఉండ‌గా.. మూవీ విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డిన సంద‌ర్బంగా ప్ర‌మోష‌న్స్ జోరునూ ద‌ర్శ‌క నిర్మాత‌లు రమేష్ వ‌ర్మ, స‌త్య‌నారాయ‌ణ పెంచారు.

ఈ సినిమాలోని అన‌సూయ పోషిస్తున్న పోస్ట‌ర్ శుక్ర‌వారం చంద్ర‌క‌ళ పాత్ర‌కు సంబంధించిన పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. శ‌నివారం ఇందులోని ఐదో పాట క్యాచ్ మీ లిరిక‌ల్ వీడియోను విడుద‌ల చేయ‌బోతున్నారు. సాయంత్రం 5.04 నిమిషాల‌కు ఈ పాట జ‌నం ముందుకు రాబోతుంది. ఈలోగా ఓపాట‌కు సంబంధించిన టీజ‌ర్‌ను విడుద‌ల చేస్తారు. దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం స‌మ‌కూర్చిన ఈ సినిమాలో ర‌వితేజ స‌ర‌స‌న డింపుల్ హ‌య‌తీ, మీనాక్షి చౌద‌రి హీరోయిన్లుగా న‌టించారు. 11న హిందీలో కూడా ఖిలాడి విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది.

Also Read :  హీరోల రేంజ్‌ని పెంచిన సినిమాలు..!

Visitors Are Also Reading