కేజీఎఫ్ ఫేమ్ కృష్ణాజీరావు గత కొద్ది రోజులుగా జీవన్మరణ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 70 ఏళ్ల వయస్సు కలిగిన కృష్ణాజీరావు నిష్క్రమణతో వినోద ప్రపంచంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇతను కేజీఎఫ్ లో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ సినిమా తరువాత దాదాపు 30 చిత్రాల్లో కనిపించాడు.
Advertisement
కొద్ది రోజుల కిందట బెంగళూరులోని సీతా సర్కిల్ సమీపంలోని వినాయక్ హాస్పిటల్ లో కృష్ణాజీరావు చేరారు. గత కొద్ది రోజుల నుంచి అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో ఉంచారు. అతనికి ఏం జరిగిందో కూడా వెల్లడించలేదు. అతను వయస్సు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడని భావించారు. యష్ నటించిన కేజీఎఫ్ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. కేజీఎఫ్ లో ఓ ప్రత్యేక పాత్ర పోషించాడు. ఆ తరువాతనే కేజీఎఫ్ కథ మలుపు తిరుగుతుంది.
Advertisement
కేజీఎఫ్ తరువాత కృష్ణాజీరావు విశేషమైన ప్రజాదారణ పొందారు. కేజీఎఫ్ లో అతను అంధుడైన వృద్ధుడి పాత్రలో పోషించాడు. కేజీఎఫ్ ఛాప్టర్ 1 2018లో విడుదలైంది. ఓ ఇంటర్వ్యూలో కేజీఎఫ్ లో అవకాశం ఎలా వచ్చిందో చెప్పుకొచ్చాడు. ఆ తరువాత దాదాపు 30కి పైగా సినిమాల్లో నటించారు. ఒకరోజు తనకు ఆడిషన్ కి కాల్ వచ్చిందని.. ఈ ఆడిషన్ లో అందరినీ ఆకట్టుకున్నానని కృష్ణాజీరావు చెప్పుకొచ్చారు. వెంటనే మేకర్స్ ఆ పాత్రను కృష్ణాజీరావుకి ఆఫర్ ఇచ్చారు.