Home » బాలీవుడ్ పై ప్రియాంక చేసిన  కామెంట్స్ వింటే ఆశ్చర్యపోవడం పక్కా..!

బాలీవుడ్ పై ప్రియాంక చేసిన  కామెంట్స్ వింటే ఆశ్చర్యపోవడం పక్కా..!

by Anji
Published: Last Updated on

బాలీవుడ్ లో వరుస సినిమాలను చేసి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ప్రియాంక  ఆ తరువాత కొన్ని హాలీవుడ్ సినిమాలు చేసినా గ్లోబల్ స్టార్ గా ఎదిగింది. ఆ తరువాత నిక్ జోనస్ ని పెళ్లాడి విదేశాలకు చెక్కేసింది. ఇటీవలే ప్రియాంక ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చిన విషయం తెలిసిందే. దాదాపు మూడేళ్ల నుంచి సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది. ఇటీవలే ఈమె భారత్ కి వచ్చింది. ప్రియాంక చోప్రా కమిట్ అయిన సినిమాలు కొన్ని ఉన్నాయి. అదేవిధంగా కొత్త ప్రాజెక్ట్స్ కూడా చేసేందుకు ప్లాన్ చేస్తుందట. ముఖ్యంగా ప్రియాంక కొత్త ప్రాజెక్ట్ ల కోసమే భారత్ కి వచ్చినట్టు సమాచారం.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రియాంక మాట్లాడుతూ.. కెరీర్ ప్రారంభంలో హీరోల రెమ్యునరేషన్ తో పోల్చితే కేవలం 10 శాతమే తనకు చెల్లించినట్టు పేర్కొంది.బాలీవుడ్ లో నాకు సమానంలో ఎప్పుడూ కూడా చెల్లించలేదు. తోటి మేల్ ఆర్టిస్ట్ లతో పోల్చుకుంటే తనకు 10 శాతమే చెల్లించే వారని చెప్పుకొచ్చింది. 

Also Read :  తెలుగు గ‌డ్డ‌పై పుట్టి… ఒక్క‌ముక్క కూడా తెలుగు రాయ‌డం చ‌ద‌వ‌డం రాని 10 మంది న‌టీన‌టులు వీళ్లే..!

చాలా మంది మహిళా నటులు ఇప్పటికీ దీనిని ఎదుర్కుంటూనే ఉన్నారు. నేను ఇప్పుడు బాలీవుడ్ లో నటించినా నాకు కూడా ఇదేవిధంగా చెల్లిస్తారని తెలిపింది. అదేవిధంగా సెట్ లో గంటల తరబడి కూర్చునే వాళ్లం.. కానీ మగాళ్లు మాత్రం స్వేచ్ఛగా వ్యవహరించారు. వారు ఇష్టం వచ్చినప్పుడు షూటింగ్ కి వచ్చే వారు అని చెప్పుకొచ్చింది.  

Also Read :  వామ్మో.. శోభన్ బాబు ఆస్తుల విలువ ఏకంగా రూ.లక్ష కోట్లా? ఆసక్తికరమైన విషయాలు రివీల్..!

Visitors Are Also Reading