Home » ఈ త‌ప్పులు చేయ‌కుంటే కేజీఎఫ్-2 మ‌రింత‌ పెద్ద హిట్ అయ్యేదా..?

ఈ త‌ప్పులు చేయ‌కుంటే కేజీఎఫ్-2 మ‌రింత‌ పెద్ద హిట్ అయ్యేదా..?

by AJAY
Ad

ఎలాంటి అంచనాలు లేకుండా రికార్డులు ఎడిట్ చేసిన సినిమా కేజీఎఫ్. ఈ కన్న‌డ‌ సినిమాను పాన్ ఇండియా లెవ‌ల్ లో విడుదల చేయగా మొదటి షోతోనే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. దాంతో హీరో య‌ష్, దర్శకుడు ప్రశాంత్ నీల్ పై ప్రశంసలు కురిసాయి. ఈ సినిమా చూసిన తర్వాత అన్ని ప‌రిశ్ర‌మ‌ల చూపు ఒక్కసారిగా కన్నడ ఇండస్ట్రీ వైపు తిరిగింది.

Advertisement

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేయడం తో సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన పార్ట్ 2 పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.అలా ఎన్నో అంచ‌నాల మ‌ధ్య కేజీఎఫ్ పార్ట్ 2 ఎప్రిల్ 14న‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మ‌ధ్య‌ విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. అయితే సినిమాలో కొన్ని తప్పులు చేయకుండా ఉండి ఉంటే మాత్రం ఈ సినిమాకు మరింత రెస్పాన్స్ వ‌చ్చేద‌ని ప్రేక్ష‌కులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

ముఖ్యంగా సినిమాలో ఫ‌స్ట్ హాఫ్ సాగదీత గా ఉందని… అది సినిమాకు మైనస్ అయ్యిందని అభిప్రాయ‌ప‌డుతున్నారు. అంతేకాదు సినిమా కేజీఎఫ్ చాప్ట‌ర్ 1 లో అనంత్ నాగ్ నటించిన పాత్ర ప్లేస్ లో ప్రకాష్ రాజ్ ను తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే మొదటి పార్ట్ లో అనంత్ నాగ్ నటనకు ప్రేక్షకులు అడిక్ట్ అయ్యారు. ఇక‌ రెండో పార్ట్ లో కూడా ఆయన్నే కంటిన్యూ చేస్తే బాగుండేదని ప్రేక్ష‌కులు అభిప్రాయపడుతున్నారు.

ఇవి త‌ప్ప సినిమా బ్లాక్ బ‌స్టర్ అని ప్ర‌తి ప్రేక్ష‌కుడు సినిమాను ఎంజాయ్ చేస్తారని చెబుతున్నారు. సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు… హీరో ఎలివేషన్ సీన్ లు గతంలో ఎప్పుడు చూడని విధంగా ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా విజయంతో ప్రశాంత్ నీల్ తెర‌కెక్కిస్తున్న స‌లార్ సినిమా పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

ALSO READ :

SUNNY LEONE : స‌న్నిలియోన్ ఫ్యాన్స్ కు బంప‌రాఫ‌ర్..అక్క‌డ చికెన్ పై డిస్కౌంట్…!

NIHARIKA KONIDELA : నిహారిక‌కు ఆంక్ష‌లు…ప‌బ్ ఇష్యూతో మెగాడాట‌ర్ స్వేచ్చను కోల్పోయిందా..?

Visitors Are Also Reading