Home » NIHARIKA KONIDELA : పబ్ ఘటన తరువాత ప్రస్తుతం నిహారిక లైఫ్ ఇంత ఘోరంగా ఉందట ! ఎలాంటి ఆంక్షలు పెట్టారంటే !

NIHARIKA KONIDELA : పబ్ ఘటన తరువాత ప్రస్తుతం నిహారిక లైఫ్ ఇంత ఘోరంగా ఉందట ! ఎలాంటి ఆంక్షలు పెట్టారంటే !

by AJAY
Ad

మెగాఫ్యామిలీ నుండి చాలా మంది హీరోలు వ‌చ్చారు. కానీ నాగ‌బాబు కూతురు నిహారిక త‌ప్ప మ‌రొక‌రు సినిమాల్లోకి రాలేదు. చిరంజీవి కూతుళ్లు సుస్మిత‌, శ్రీజ కూడా స్క్రీన్ కూడా దూరంగా ఉన్నారు. ఇక ప్ర‌స్తుతం సుస్మిత నిర్మాత‌గా వెబ్ సిరీస్ లు తీస్తోంది. అయితే న‌ట‌న‌కు మాత్రం ఇద్ద‌రూ దూరంగానే ఉన్నారు. కానీ నాగ‌బాబు కూతురు నిహారిక త‌న‌కు ముందు నుండి ఆస‌క్తి ఉండ‌టంతో మొద‌ట ఈటీవీలో ప్ర‌సార‌మ‌య్యే టాప్ షో ఢీ కు యాంక‌ర్ గా ఎంట్రీ ఇచ్చింది. రెండు సీజ‌న్ల‌కు యాంక‌రింగ్ చేసి ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది.

Advertisement

ఆ త‌ర‌వాత న‌ట‌న‌పై ఉన్న ఆస‌క్తితో యూట్యూబ్ లో వెబ్ సిరీస్ లు నిర్మించ‌డంతో పాటూ న‌టించింది. ఆ త‌ర‌వాత ఏకంగా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి అంద‌ర్నీ అవాక్క‌య్యేలా చేసింది. కానీ సినిమాల్లో రాణించ‌లేక‌పోయింది. నిజానికి తాను హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తానంటే కుటుంబ స‌భ్యులు ఒప్పుకోలేద‌ని వాళ్ల‌ను ఒప్పించేందుకు చాలా కాలం ప‌ట్టింద‌ని నిహారిక ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పింది. దాంతో మెగాఫ్యామిలీ నిహారిక‌కు చాలా స్వేచ్చ‌ను ఇచ్చిన‌ట్టు అర్థం అయ్యింది.

Advertisement

సినిమాల‌లో సక్సెస్ అవ్వ‌లేక‌పోవ‌డంతో త‌ను ప్రేమించిన యువ‌కుడిని పెళ్లి చేసుకుని నిహారిక జీవితంలో సెటిల్ అయ్యింది. ఇదిలా ఉంటే నిహారిక గ‌తంలో త‌న జిమ్ లో వ్యాయామం చేస్తున్న వీడియోలు కొన్ని వైర‌ల్ అయ్యాయి. అయితే ఆ వీడియోల‌పై అత్తింటివారు హ‌ర్ట్ అయ్యార‌ట‌. దాంతో నిహారిక త‌న ఇన్స్టాగ్రామ్ ఖాతాను డిలీట్ చేసుకుంద‌ని టాలీవుడ్ లో వార్త‌లు వినిపించాయి. ఇక రీసెంట్ గా నిహారిక ఉగాది నాడు అర్ధ‌రాత్రి త‌ర‌వ‌త ప‌బ్ కు వెళ్ల‌డంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పురుషులైనా స్త్రీలైనా ప‌బ్ కు వెళ్ల‌డంతో త‌ప్పులేదు కానీ అర్ధ‌రాత్రి త‌ర‌వాత ప‌బ్ పై నిషేదం ఉంటుంది.అలాంటి స‌మ‌యంలో ప‌బ్ లో ఉండ‌టం వ‌ల్లే నిహారిక స‌హా పలువురు సెల‌బ్రెటీల‌ను పోలీసులు అద‌పులోకి తీసుకున్నారు. ఇదిలా ప‌బ్ ఇష్యూకు ముందు నిహారిక‌కు చాలా స్వేచ్ఛ ఉండేద‌ట‌. కానీ ప‌బ్ ఘ‌ట‌న‌తో ప‌వ‌న్ క‌ల్యాణ్ పై నాగ‌బాబు పై ట్రోల్స్ వ‌చ్చాయి. ఏపీలో డ్ర‌గ్స్ పై కొట్లాడే వాళ్లు ఇప్పుడు మాట్లాడ‌రా అంటూ వైసీపీ అభిమానులు నిల‌దీశారు. దాంతో నిహారిక‌కు ఇంట్లో క‌ఠిన‌మైన ఆంక్ష‌లు విధించారంటూ టాక్ వినిపిస్తోంది. మ‌రోవైపు అత్తింటివారు కూడా ఈ విష‌యంలో నిహారిను హెచ్చ‌రించారాని దాంతో నిహారిక ఇంట్లోనే ఉంటుంద‌ని ఫిల్మ్ న‌గ‌ర్ లో టాక్ వినిపిస్తోంది.

ALSO READ : 

అలీ ప‌క్క‌న న‌టించ‌న‌ని చెప్పిన సౌంద‌ర్య‌..కార‌ణం ఏంటో తెలుసా..!

RRR మల్లి తల్లి ఫ్లాష్ బ్యాక్ సీన్ల‌ను మొత్తం లేపేశారట…!

Visitors Are Also Reading