Home » త్వరలో కీర్తి సురేష్ పెళ్లి…వరుడి బ్యాగ్రౌండ్ తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే…!

త్వరలో కీర్తి సురేష్ పెళ్లి…వరుడి బ్యాగ్రౌండ్ తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే…!

by AJAY
Ad

హీరోయిన్ కీర్తి సురేష్ అంటే సౌత్ ఇండియా లో పరిచయం అక్కర్లేని పేరు. కీర్తి సురేష్ తండ్రి ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా రానించేవారు. ఇక తండ్రి వారసత్వం గా చైల్డ్ ఆర్టిస్ట్ గా కీర్తి సురేష్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తరవాత తన నటన తో ఆకట్టుకుని పలు సూప్ హిట్ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది.

keerthy suresh

Advertisement

హీరోయిన్ గా టాలీవుడ్ లో నేను శైలజ సినిమాలో నటించింది. ఈ సినిమా మంచి విజయం సాధించడం తో ఆ తరవాత టాలీవుడ్ లో ఆఫర్ లు క్యూ కట్టాయి. ఇక మహానటి సినిమా తో ఇండియా వ్యాప్తంగా కీర్తి కి క్రేజ్ పెరిగింది. ఈ సినిమాలో అద్భుత నటన తో ఆకట్టుకుంది. అంతే కాకుండా ఈ సినిమా తరవాతనే కీర్తి సురేష్ మహానటి అనే పేరు సంపాదించుకుంది.

Advertisement

ఇదిలా ఉంటే ఈ ముద్దుగుమ్మ ఇంకా పెళ్లి పీటలు ఎక్కలేదు. దాంతో ఎప్పుడూ కీర్తి పెళ్లి వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతూ ఉన్నాయి. అప్పట్లో కీర్తి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ తో ప్రేమలో ఉందని అతడిని పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు వినిపించాయి. కానీ ఆ వార్తలను కీర్తి కొట్టి పడేసింది.

keerthy suresh

కాగా తాజాగా మళ్లీ కీర్తి పెళ్లి వార్తలు మొదలయ్యాయి. కీర్తి సురేష్ తన బాల్య మిత్రుడిని పెళ్లి చేసుకుంటుంది అని టాక్ వినిపిస్తోంది. అంతే కాకుండా వాళ్ళిద్దరూ 13 ఏళ్లుగా రిలేషన్ షిప్ లో ఉందని టాక్ వినిపిస్తోంది. మహానటి చేసుకోబోయే వాడు వ్యాపారవేత్త అని అతడికి కేరళ లో రిసార్ట్ లు ఉన్నాయని తెలుస్తోంది.

Also read: Pawan Kalyan : గుడిలో ఉంటే “వారాహి”.. రోడ్డు మీద ఉంటే “పంది” పవన్ పై మళ్లీ రెచ్చిపోయిన వర్మ!

Visitors Are Also Reading