సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. సినిమా హిట్ ఫ్లాప్ కు సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలను పట్టాలెక్కిస్తున్నారు. ఇటీవల రామ్ గోపాల్ వర్మ రాజకీయ నాయకుడు కొండా మురళి బయోపిక్ ను తెరకెక్కించారు. ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఈ సినిమాకు భారీగా ప్రచారం చేసిన నెగిటివ్ టాక్ ను మూట కట్టుకుంది. అటు సినీ తారలు, రాజకీయ నాయకుల పై కూడా వర్మ సెటైర్లు పేల్చుతుంటారు.
Advertisement
READ ALSO : Venkatesh 75 : వెంకటేష్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ! అదిరిపోయిన ‘సైంధవ్’ గ్లింప్స్!
ఇప్పుడు తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్ ను టార్గెట్గా చేసుకున్నారాయన. వారాహి వాహనాన్ని వదల్లేదు. గుడిలో ఉంటే వారాహి, రోడ్డు మీద ఉంటే పంది… పవన్ పై మళ్లీ రెచ్చిపోయారు వర్మ. ఏపీవ్యాప్తంగా నిర్వహించడానికి తలపెట్టిన బస్సు యాత్ర కోసం రూపొందించుకున్న వారాహి వాహనం, దాని డిజైన్ పై రాంగోపాల్ వర్మ విమర్శలు చేశారు. దాన్ని హిట్లర్ వాహనంగా అభివర్ణించారు. తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో పూజల సందర్భంగా పవన్ కళ్యాణ్ కాషాయ వస్త్రాలను ధరించడం పైన కామెంట్ చేశారు ఆర్జీవి.
Advertisement
పవన్ కళ్యాణ్ ను స్వామి వివేకానందుడిగా పేర్కొన్నారు. హిట్లర్ వాహనంపై స్వామి వివేకానందుడు అంటూ సెటైర్ వేశారు. ఈ మేరకు వరుస ట్వీట్లు పోస్ట్ చేశారు. మరో ట్వీట్ లో వారాహి వాహనాన్ని వరాహంగా అభివర్ణించారు. పంది వాహనంగా పేర్కొన్నారు. హిట్లర్, స్వామి వివేకానంద ఆయన కుడి, ఎడమ పాదాలను నొక్కుతారు. పవర్ స్టార్ పవన్ అంటే అదేనంటూ చురకలు అంటించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చైతన్య రథం ప్రస్తావనను తీసుకొచ్చారు రాంగోపాల్ వర్మ.
READ ALSO : బాలయ్యకు బిగ్ షాక్..అన్నపూర్ణ స్టూడియోస్ లోకి నో ఎంట్రీ….!
ఆ రోజుల్లో రామారావు గారు "చైతన్య రథం" మీద తిరిగితే, మీరు”పంది బస్సు” మీద తిరుగుతున్నారు అంటున్న తప్పుడు నా కొడుకులందర్నీ జనసేనలతో బస్సు టైర్లకింద తొక్కించేయండి సార్! ఒకవేళ అలా చేయడం లీగల్ గా కుదరదనుకుంటే కనీసం కేసులన్నా పెట్టించండి @PawanKalyan గారూ.ఇది మీ ఫ్యాన్ గా నా విన్నపం🙏 pic.twitter.com/9LRcCrt4Ux
— Ram Gopal Varma (@RGVzoomin) January 24, 2023
Advertisement