పెళ్లి అంటే నూరేళ్ల పంట. అది జీవితంలో ఒకేసారి జరుగుతుంది. ముఖ్యంగా పెళ్లి అంటే జీవితంలో ఎంతో మధురమైనది కూడా. ఇలాంటి మధురమైన జీవితంలో సరైన భాగస్వామితో పెళ్లి జరిగితే జీవితం సుఖ, సంతోషాలతో ఆనందంగా ఉంటుంది. కొత్తగా పెళ్లి చేసుకునే వారు మీ జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ఆ తరువాతే పెళ్లి చేసుకోండి. సరైన జీవిత భాగస్వామి దొరక్కపోతే జీవితాంతం కష్టాలు పడాల్సి వస్తుంది. అసలు ఎప్పుడూ ఆనందమే ఉండదు. అందుకే కొత్తగా పెళ్లి చేసుకునే వారు తప్పకుండా వీటిని పాటించండి.
Advertisement
మీ జీవిత భాగస్వామి ఒకరిని గౌరవించే స్వభావం గల వారు అయితే మంచిది. ఎందుకు అంటే రేపు మిమ్మల్ని గౌరవించాలి. మీ కలల్ని, మీ ఆలోచనలను కూడా గౌరవించాలి. లేదంటే తరచూ గొడవలు వస్తూనే ఉంటాయి. ఒక వ్యక్తిని బాగా అర్థం చేసుకునే స్వభావం జీవిత భాగస్వామికి ఉంటే మంచిది. వివాహం చేసుకోవాలంటే దీనిని గమనించండి. వయస్సు పరంగా కూడా చూసుకుంటుండాలి. ఎందుకంటే వయస్సు తేడా ఎక్కువగా ఉంటే కూడా మనస్థత్వాలు ఒకే విధంగా ఉండవు.
Advertisement
ఇది కూడా చదవండి : టిఫిన్‌గా మీరు ఇడ్లీ, దోశ, వడ తింటున్నారా..? అయితే మీరు ఈ వ్యాధి బారిన పడడం పక్కా..!
ప్రధానంగా ఒకరి ఇష్టాన్ని మరొకరూ పంచుకునే వ్యక్తిని పెళ్లి చేసుకోవడం వల్ల సమస్యలు తలెత్తవు. తరచూ మీతో వాళ్లు షేర్ చేసుకుంటుంటారు. అదేవిధంగా మీ జీవిత భాగస్వామి కుటుంబం గురించి మీరు జాగ్రత్త పడాలి. కెరీర్ పట్ల ఒక ప్రణాళిక వేసుకొని జీవితంలో చాలా చక్కగా ముందుకు వెళ్లే వ్యక్తిని కోరుకోండి. లేదంటే మీరు ప్రమాదంలో పడుతారు జాగ్రత్త..!
ఇది కూడా చదవండి : సిల్క్ స్మితకు తోడుగా ఉన్న అన్నపూర్ణ ఎవరో మీకు తెలుసా..?