Telugu News » Blog » సిల్క్‌ స్మిత‌కు తోడుగా ఉన్న‌ అన్న‌పూర్ణ ఎవ‌రో మీకు తెలుసా..?

సిల్క్‌ స్మిత‌కు తోడుగా ఉన్న‌ అన్న‌పూర్ణ ఎవ‌రో మీకు తెలుసా..?

by Anji
Ads

సినిమా న‌టుల గురించి, వారి జీవితం గురించి మ‌నం నిత్యం చ‌ర్చించుకుంటూనే ఉంటాం. ఇప్పుడు అలాంటి వారిలో సిల్క్ స్మిత ఒక‌రు. ఆమె సినీ ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక ఇమేజ్‌ని సంపాదించుకున్నారు. ఒకానొక స‌మ‌యంలో వ‌రుస సినిమాల‌తో బిజీ లైఫ్‌ని లీడ్ చేసిన న‌టి సిల్క్ స్మిత ఒక‌ర‌ని చెప్ప‌వ‌చ్చు. ఆమె ప‌ల్లెటూరులో పుట్టి పెరిగింది. సినిమాల్లో న‌టించాల‌నే కోరిక‌తో పెద్ద‌మ్మ‌తో క‌లిసి చెన్నై రైలు ఎక్కింది విజ‌య‌ల‌క్ష్మీ. ఓ ప్ర‌ముఖ న‌టీమ‌ణికి ఆమె మేక‌ప్ ఆర్టిస్ట్‌గా చేసేందుకు ప‌నికి కుదిరింది. ఇక అక్క‌డి నుంచే త‌న సినీ ప్ర‌స్థానం ప్రారంభ‌మైంది. త‌మిళ సినిమాలో న‌టించేందుకు ఓ డైరెక్ట‌ర్ ఆమె పేరును సిల్క్ స్మిత‌గా మార్చారు.

Ads

 

ఉన్న‌త శిఖ‌రాల‌ను అధిరోహించే త‌రుణంలోనే ఆమె ఒక్క‌సారిగా కింద‌ప‌డిపోయింది. తాను న‌మ్మిన వాళ్లే త‌న‌ను మోసం చేశార‌ని తెలిసి త‌ట్టుకోలేక‌పోయింది. అసిస్టెంట్ గా చేరిన వ్య‌క్తి త‌న మాయ మాట‌ల‌తో సిల్క్ స్మిత‌ను లొంగ‌దీసుకుని.. చివ‌రికీ త‌న మీద పెత్త‌నం చేసి ఆమె జీవితాన్ని చిత్తు కాగితంలా మార్చేశాడు. ఇక ఇవ‌న్నీ త‌ట్టుకోలేక మాన‌సికంగా కృంగిపోయి ఆమె ఓ అపార్ట్‌మెంట్ పై నుంచి దూకి చ‌నిపోయింది. సిల్క్‌స్మిత జీవిత ప్ర‌యాణంలో మొద‌టి నుంచి అన్ని తానై ఉన్న ఓ మ‌హిళ అన్న‌పూర్ణ‌మ్మ. సిల్క్‌స్మిత‌ను చిన్న‌త‌నంలోనే ద‌త‌త్త తీసుకుంది. ప‌దేళ్ల వ‌య‌స్సులోనే చిత్ర సీమ‌పై మ‌న‌స్సు పారేసుకున్న సిల్క్ స్మిత కోరిక‌ను గ‌మ‌నించించింది ఆమె పెద్దమ్మ అన్న‌పూర్ణ‌మ్మ‌. చిన్న‌త‌నంలోనే సిల్క్‌స్మిత‌ను ద‌త్త‌త తీసుకుంది. ప‌దేళ్ల వ‌య‌స్సులోనే చిత్ర సీమ‌పై మ‌న‌సు పారేసుకున్న సిల్క్‌స్మిత కోరిక‌ను ఆమె పెద్ద గ‌మ‌నించి ఓ న‌టిగా చేయాల‌ని గుంటూరు నుంచి చెన్నై వ‌ర‌కు ఆమెను చేర్చింది. మ‌ధ్య‌లో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా భ‌రించింది.

ఇది కూడా చ‌ద‌వండి :  వీల్ చైర్‌కి ప‌రిమిత‌మైన టాలెంటెడ్ న‌టుల గురించి మీకు తెలుసా..?

Ads

ఛాయాదేవికి అసిస్టెంట్‌గా, ప‌ని మ‌నిషిగా కూడా బ్ర‌తికింది సిల్క్ స్మిత‌. సిల్క్ స్మిత పెద్ద‌మ్మ అయిన అన్న‌పూర్ణ‌మ్మ ఇళ్ల‌ల్లో పాచి ప‌నులు కూడా చేసింది. ఒక్కోసారి తాడికొండ‌లో ఓ షూటింగ్ జ‌రుగుతుండ‌గా.. అక్క‌డ అవ‌కాశం కోసం అన్న‌పూర్ణ‌మ్మ సిల్క్‌స్మిత ఇద్ద‌రు వెళ్లారు. మూడు రోజుల పాటు ఏం తిన‌కుండా ఉప‌వాసం ఉన్నారు. మెల్ల‌గా సిల్క్ స్మిత‌కి అవ‌కాశాలు అయితే వ‌చ్చాయి. కానీ ఓ వైపు ప్రేమ పేరుతో వాడుకునే వాళ్లు, మోసగాళ్లూ అవ‌కాశం ఇస్తా అని ప‌క్క‌లోకి ర‌మ్మనే వాళ్లు ఎక్కువ‌య్యారు. ఇవ‌న్నీ అన్న‌పూర్ణ‌మ్మకి తెలిసిన ఏమి చేయ‌లేక‌పోయింది. ఇద్ద‌రూ క‌లిసి అంచెలంచెలుగా అద్దె ఇంటి నుంచి పెద్ద ఇంటికి, చివ‌ర‌గా సొంత బంగ్లాకి చేరుకున్నారు.

ఇది కూడా చ‌ద‌వండి :  iBomma : ఐ బొమ్మ‌కి సినిమాలు ఎలా వ‌స్తాయో తెలుసా..?

అన్న‌పూర్ణ‌మ్మ మాత్రం సిల్క్ స్మిత వెంట‌నే ఉంటూ త‌న‌కు ఏం కావాలో అన్ని ద‌గ్గ‌ర ఉండి చూసుకునేది. సిల్క్ స్మిత కోపంలో అన్న‌పూర్ణ మీద చిరాకు ప‌డ్డా ప‌ల్లెత్తు మాట కూడా అనేది కాదు. చివ‌రికీ న‌డి వ‌య‌స్సు ఉన్నా.. అందులో పెళ్లి అయి భార్య, పిల్లలు క‌లిగి ఉన్న అబ్బాయిని ప్రేమిస్తున్నానంటే కూడా ఒప్పుకుంది. అత‌న్ని, అత‌ని పెళ్లాం, పిల్ల‌ల‌ను ఇంట్లో తెచ్చి పెట్టినా త‌ల ఊపింది. కానీ వ‌ద్ద‌ని ఎప్పుడు చెప్ప‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. అన్న‌పూర్ణ ఆ రోజే సిల్క్ స్మిత‌ను మంద‌లించి ఉంటే ఇవాళ ఆమె మ‌న మ‌ధ్య‌లోనే ఉండేది. తొలుత అన్ని అధికారాలు అన్న‌పూర్ణ‌మ్మ చేతిలోనే ఉండేవి.కానీ మెల్ల మెల్ల‌గా ఇంటిని, డ‌బ్బును, ఆస్తుల‌ను సిల్క్ స్మిత ప్రేమికుడు దోచేస్తుంటే అన్న‌పూర్ణ‌మ్మ అడ్డు చెప్ప‌లేదు. సిల్క్ స్మిత కూడా ప్రేమికుడి మైకంలోనే ఉండేది. ఒక్కోసారి అన్న‌పూర్ణ‌మ్మ అడ్డు చెప్పినా సిల్క్‌స్మిత వేనేది కాదు.. అలా విని ఉంటే మాత్రం ప‌రిస్థితి మ‌రోలా ఉండేది.

Ad

ఇది కూడా చ‌ద‌వండి :  బ్రహ్మాస్త్ర కోసం రాజమౌళి పడుతున్న కష్టం వెనుక అసలు కారణం తెలుసా..?