Home » టిఫిన్‌గా మీరు ఇడ్లీ, దోశ‌, వ‌డ తింటున్నారా..? అయితే మీరు ఈ వ్యాధి బారిన ప‌డ‌డం ప‌క్కా..!

టిఫిన్‌గా మీరు ఇడ్లీ, దోశ‌, వ‌డ తింటున్నారా..? అయితే మీరు ఈ వ్యాధి బారిన ప‌డ‌డం ప‌క్కా..!

by Anji
Ad

సాధార‌ణంగా మూడు పూట‌లు అన్నం తిన‌డం వ‌ల్ల లావు అవుతుంటాం. ఉద‌యం రాత్రికి టిఫిన్ చేశామంలో కొంత‌లో కొంత అయిన బ‌రువు త‌గ్గించుకోవ‌చ్చు. బ‌రువు త‌గ్గ‌డానికి ఈ విధానాన్ని అనుస‌రిస్తే త‌ప్ప‌కుండా బ‌రువు త‌గ్గించుకోవ‌చ్చు. ముఖ్యంగా కొంద‌రూ అయితే రోజంతా టీ, కాఫీల మీద ఆధార‌ప‌డుతుంటారు. వీటి ద్వారా ఆక‌లి చ‌నిపోయి తిన‌డం త‌గ్గించి బ‌రువు త‌గ్గాల‌నుకునే ఆలోచ‌న కొంద‌రిది. టీ, కాఫీ, టిఫిన్స్ వ‌ల్ల మీకు తెలియ‌కుండానే మీ శ‌రీరానికి పెద్ద న‌ష్టం చేసుకుంటున్నారు. ఇడ్లీ, దోశ‌, వ‌డ వంటి టిఫిన్స్ డెయిలీ తిన‌డం వ‌ల్ల జీర్ణ‌వ్య‌వ‌స్థ దెబ్బ‌తింటుంది.

Advertisement

పూర్వ‌కాలంలో మ‌న పెద్ద‌లు అయితే ఉద‌యం వేళ‌లో శ‌రీరానికి మంచి పోష‌కాల‌ను కండ పుష్టిని ఇచ్చే ఆహారాన్ని తీసుకునేవారు. పెరుగులో స‌ద్ద‌న్నం, జొన్న గ‌ట‌క‌, రాగి సంక‌టి వంటివి ఎన్నో పోష‌కాల ప‌రంగా వెల‌క‌ట్ట‌లేని ఆహారాలు ఉన్నాయి. ఇక త‌రువాత అంద‌రూ మూడు పూట‌లా అన్నం తిన‌డం అల‌వాటు అయింది. ఉద‌యం టిఫిన్లు మ‌ధ్యాహ్నం అన్నం, రాత్రికి అల్ఫాహారం, మ‌ళ్లీ టిఫిన్లు తిన‌డం వంటివి చేస్తుంటారు. మిగ‌తా టిఫిన్స్‌తో పోల్చితే ఇడ్లీ మంచిదే కానీ దీంట్లో సాంబారు, అల్లం చ‌ట్నీ, కారంపొడి, నెయ్యి అన్నింటిని క‌లిపి తిన‌డం వ‌ల్ల క‌డుపులో ఎసిడీటీ పెరిగిపోతుంది. అదేవిధంగా బియ్యం కంటే మిన‌ప‌ప్పులో ఎక్కువ క్యాల‌రీలుంటాయి. ఇవి షుగ‌ర్‌ని పెంచుతాయి.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  బెల్లి ఫ్యాట్‌ని క‌రిగించే సింపుల్ టిప్స్ తెలుసుకోండి..!

ప్ర‌తిరోజూ టిఫిన్స్ తిన‌డం వ‌ల్ల పేగులు త‌న శ‌క్తిని కోల్పోతాయి. అదేవిధంగా జీర్ణ‌వ్య‌వ‌స్థ పూర్తిగా దెబ్బ తింటుంది. వాత వ్యాధులు కీళ్ల నొప్పులు వంటి వ‌స్తుంటాయి. నిత్యం ఇడ్లీ, దోశ‌, వ‌డ, పూరీ ప‌రోటా వంటి టిఫిన్లు దీర్ఘ‌కాలంగా అన‌గా 15 సంవ‌త్స‌రాలుగా తింటున్న వారికి షుగ‌ర్ వ్యాధి వ‌చ్చేస్తోంద‌ట‌. వారానికి ఒక‌టి లేదా రెండు సార్ల వ‌ర‌కే ప‌రిమితం చేయాలి. ఉద‌యం వేళ పెరుగు అన్నం, రాత్రి మిగిల్చిన అన్నాన్ని పెరుగ‌లో క‌లిపి పెట్టుకొని మార్నింగ్ తిన‌డం, లేదంటే మొల‌కెత్తిన గింజ‌లు, పండ్లు, ఖ‌ర్జూరాలు వంటివి తిన‌డం అల‌వాటు చేసుకుంటే కొద్ది రోజుల్లోనే మీ ఆరోగ్యంలో మార్పు గ‌మ‌నించ‌వ‌చ్చు. ముఖ్యంగా మ‌ధ్యాహ్నం క‌డుపు నిండా తినాలి. ఉద‌యం లేదా నైట్ చాలా మంది తిన‌రు. కానీ టిఫిన్లు లాగించేస్తుంటారు. ఇలా చేయ‌డం ద్వారా అన్నం తిన్న‌దానికంటే ఎక్కువ శ‌రీరానికి న‌ష్టం క‌లుగుతుంది. ప్ర‌ధానంగా రాత్రి వేళ‌ల‌లో తేలికగా ఉన్న‌ ఫుడ్ తీసుకోవ‌డం వ‌ల్ల ఆరోగ్యంగా ఉంటారు.

ఇది కూడా చ‌ద‌వండి :  వీల్ చైర్‌కి ప‌రిమిత‌మైన టాలెంటెడ్ న‌టుల గురించి మీకు తెలుసా..?

Visitors Are Also Reading