Home » రైతన్నలే లక్ష్యంగా కేసీఆర్ సరికొత్త వ్యూహం.. అంతా కాంగ్రెస్ మాయేనా..!!

రైతన్నలే లక్ష్యంగా కేసీఆర్ సరికొత్త వ్యూహం.. అంతా కాంగ్రెస్ మాయేనా..!!

Ad

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ముందుగా అభివృద్ధి పనులను రైతులతో స్టార్ట్ చేశారు. రైతు బంధు,రైతు బీమా, ఉచిత కరెంటు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కళ్యాణ లక్ష్మి ఇలా మరెన్నో పథకాలు తీసుకొచ్చారు. ముఖ్యంగా రైతులను ఎల్ల వేళలా ఆదుకుంటామని చెబుతూనే రైతుల పక్షాన నిలుస్తూ వస్తున్నారు. ఈ తరుణంలో మొన్న జరిగిన వరంగల్ డిక్లరేషన్ సభలో కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ రైతుల సమస్యలను హైలెట్ చేస్తూ లోపాలను ఎత్తి చూపుతూ మాట్లాడిన విషయం అందరికి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం చేసే దానికంటే రైతులకు ఇంకా ఎక్కువ చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రెండు లక్షల రుణమాఫీ, కౌలు రైతులకు ఏటా 15 వేల రూపాయలు, వ్యవసాయ కూలీలకు 12000, ఉపాధి హామీ పని వ్యవసాయానికి అనుసంధానం, ఇంకా అనేక ఆఫర్లు రైతుల పక్షాన ప్రకటించారు. ఈ సందర్భంగా చాలా మంది రైతులు ఆలోచనలో పడ్డారు అని చెప్పవచ్చు. దీంతో తెరాస ప్రభుత్వం కాంగ్రెస్ వరంగల్ డిక్లరేషన్ సభ సందర్భంగా ఇచ్చిన హామీలకు విరుగుడుగా కెసిఆర్ సరికొత్త వ్యూహాన్ని అమలు చేయడం కోసం సిద్ధం అవుతున్నారని తెలుస్తోంది. రాష్ట్రంలో నియంత్రిత సాగు అమలు చేయడానికి గతంలో ప్రయత్నాలు విఫలం కావడం, కాలేశ్వరం నిండా నీళ్లు ఉన్నా, కరెంటు ఉన్న వరి పంట వేస్తే ఉరి వేసుకున్నట్లే అని హెచ్చరించడం, కేంద్రంపై వరి పోరు యుద్ధాన్ని సాగించడం చివరికి తానే తగ్గిపోయి ధాన్యాన్ని కొనుగోలు చేయడం చూస్తున్నాం. కెసిఆర్ నిర్ణయాల వల్ల చాలా మంది రైతులు నష్టపోయారని, టిఆర్ఎస్ బిజెపి కుమ్మక్కై మోసం చేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపణలు సంధిస్తోంది. కెసిఆర్ ఎక్కువగా ఫోకస్ పెట్టే వ్యవసాయ అంశాలను అస్త్రాలుగా కాంగ్రెస్ మార్చుకుంటుందని తెరాస గ్రహించింది. దీంతో రైతుల కోసం “వ్యవసాయ ప్రగతి” కార్యక్రమం నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది.

Advertisement

ALSO READ ;

Advertisement

డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలనుకుంటున్న వారికి గుడ్ న్యూస్..!!

మినరల్ వాటర్ కంటే.. ఈ వాటర్ చాలా మంచివి..!

 

 

Visitors Are Also Reading