Home » డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలనుకుంటున్న వారికి గుడ్ న్యూస్..!!

డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలనుకుంటున్న వారికి గుడ్ న్యూస్..!!

Ad

18 సంవత్సరాలు నిండి వాహనాలు నడిపే వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి. లేదంటే వారు నడపడానికి అనర్హులు.. కాబట్టి డ్రైవింగ్ లైసెన్స్ తప్పకుండా తీసుకోవాలి.. అలాంటివారికి గుడ్ న్యూస్.. అది ఏంటో ఒకసారి చూడండి..!! ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలంటే చాలా పెద్ద తతంగం ఉంటుంది. అప్లై చేసిన తర్వాత నెలకు రావచ్చు సంవత్సరానికి రావచ్చు. ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు.. దీంతో చాలా మంది వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలామంది ఈ ప్రాసెస్ తెలియనివారు లైసెన్సు ఎందుకులే అని తీసుకొని వారు చాలా మందే ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆర్టిఏ తన నియమ నిబంధనలు సవరించింది. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడంతో ఈ సవరణ జరిగింది. విషయమేంటంటే లైసెన్స్ కావాలనుకునేవారు డ్రైవింగ్ టెస్ట్ లేకుండానే లైసెన్స్ పొందే వీలు కల్పించారు. మీరు వింటున్నది నిజమే నండి. కొత్త నిబంధనల ప్రకారం ప్రైవేట్ డ్రైవింగ్ స్కూల్స్ కి ప్రభుత్వ గుర్తింపు కూడా ఇవ్వనుంది. ప్రభుత్వం గుర్తింపునిచ్చిన డ్రైవింగ్ స్కూల్ లో విజయవంతంగా డ్రైవింగ్ పూర్తిచేస్తే ఆర్టిఏ నుంచి లైసెన్సు ఈజీగా పొందొచ్చు. అయితే ప్రభుత్వం గుర్తింపునిచ్చే డ్రైవింగ్ స్కూల్ లో కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. స్కూల్స్ పెట్టాలనుకునే వారు ఎకరం స్థలం భారీ వాహనాల శిక్షణ కేంద్రం కోసం ఏర్పాటు చేయాలని ప్రభుత్వ నిబంధనలు పెట్టింది. ఈ స్కూల్లో డ్రైవింగ్ చేసి వచ్చినవారికి ప్రభుత్వం నుంచి లైసెన్స్ జారీ చేయనుంది.

Advertisement

ALSO READ;

Advertisement

వ్య‌వ‌సాయ మోటార్ల‌కు విద్యుత్ మీట‌ర్లు.. ఏపీ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం

రోజు ఈ పని చేస్తే మీకు ఏ సమస్యలు రావు…!

 

 

Visitors Are Also Reading