Home » TDP లోకి కెసిఆర్ చేరిన రోజు ఏమయ్యిందో తెలుసా ? మరువేషం లో ఎన్టీఆర్…!

TDP లోకి కెసిఆర్ చేరిన రోజు ఏమయ్యిందో తెలుసా ? మరువేషం లో ఎన్టీఆర్…!

by Sravya
Ad

ఎన్టీఆర్ గారు ఒకపక్క రాజకీయాలతో ఇంకొకపక్క సినిమాలతో బిజీగా ఉండేవారు రెండిట్లో కూడా ఆయన అద్భుతంగా రాణించారు. కేసీఆర్ విషయానికి వస్తే కేసీఆర్ టిడిపిలోకి ఎలా చేరారు అనేది ముందు చూద్దాం.

ntr-kcr

Advertisement

ఒకరోజు ఎన్టీఆర్ ని కలవడానికి కేసీఆర్ వెళ్లారట యూత్ కాంగ్రెస్ లో ఆయన ఉన్నట్లు చెప్పారు మదన్ మోహన్ రావు గారు రాజకీయాల్లో కేసీఆర్ ని ఎదగనివ్వట్లేదని రామారావు గారు అంటే అభిమానమని ఆయనని కలవడానికి వచ్చానని కేసీఆర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు తో కేసీఆర్ చెప్పారు. ఆయనకి ఇష్టం లేకపోయినా సరే షూటింగ్లో ఉన్న రామారావు గారిని కలవడానికి కేసీఆర్ ని తీసుకుని వెళ్లారట.

cm kcr

cm kcr

అప్పుడు చండశాసనుడు సినిమా షూటింగ్ అవుతోంది రామారావు గారితో కెసిఆర్ గురించి చెప్పారు ఇలా టీడీపీలో కేసీఆర్ ప్రస్తావన స్టార్ట్ అయింది. సిద్దిపేటలో మొట్టమొదట పోటీ చేసి ఓడిపోయారు ఒక సమయంలో పార్టీ ప్రచారం జరుగుతోంది. పార్టీ ప్రచారం కోసం వెళుతున్నప్పుడు ఇబ్బంది అయ్యింది పడవ మీద వెళ్లాల్సి వచ్చింది ఆ టైంలో పడవలో ఎన్టీఆర్ తో పాటుగా మేనకా గాంధీ తదితరులు వెళ్లారు. కరీంనగర్ అయిపోయిన తర్వాత జగిత్యాల లో కూడా ప్రచారం చేశారు. అయితే టైం సరిపోకపోవడంతో కొన్ని చోట్లకి వెళ్ళలేదు.

Advertisement

గెస్ట్ హౌస్ ముందు నుండి కారు ఎక్కడానికి వీలు కాలేదు దొంగతనంగా మారువేషం వేసుకొని ఎన్టీఆర్ గారు గెస్ట్ హౌస్ వెనక నుండి కారు ఎక్కారు. రామారావు గారు వెళుతుండగా దారిలో సిద్దిపేట వచ్చింది. సిద్దిపేటలో కారు ఆపారు కేసీఆర్. ఆ ముందు రోజు ఎక్కువ మంది జనం వచ్చారట. ఏకకంగా లక్షల్లో జనం వచ్చారు కానీ రామారావు గారు రారని తెలిసి వెళ్లిపోయారు. కెసిఆర్ రామారావును చూసి బాధపడ్డారు నిన్న చాలా మంది వచ్చారు ఈరోజు వాళ్లంతా లేరు. నిన్న వచ్చి ఉంటే జనం అందరూ ఉండేవారు అని బాధపడ్డారు కేసీఆర్ కేసీఆర్ ని ఎన్టీఆర్ ఓదార్చారు ఆ ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోయారు. ఒకవేళ కనుక ఎన్టీఆర్ కనుక అక్కడ ప్రచారం చేసి ఉంటే కచ్చితంగా కేసీఆర్ గెలిచేవారు. కేసీఆర్ ని ఓడించిన వ్యక్తి పేరు మదన్ మోహన్.

తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading