Home » లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్‌.. నలుగురి పేర్లతో తొలి జాబితా

లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్‌.. నలుగురి పేర్లతో తొలి జాబితా

by Anji
Ad

త్వరలో జరుగనున్న పార్లమెంట్‌ ఎన్నికల కోసం బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అభ్యర్థులను ప్రకటించారు. తొలి జాబితాలో నాలుగు పార్లమెంట్‌ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. కరీంనగర్‌కు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌, పెద్దపల్లికి కొప్పుల ఈశ్వర్‌, ఖమ్మం నామా నాగేశ్వరరావు, మహబూబూబాద్‌ స్థానానికి మాలోత్‌ కవిత పేర్లను ప్రకటించారు.

Advertisement

నాలుగు పార్లమెంట్‌ నియోజకవర్గాలకు చెందిన నేతలతో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ ఆది, సోమవారాల్లో  వరుస సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికలపై నేతలతో చర్చించి.. అభ్యర్థుల ఎంపికపై అభిప్రాయాలను సేకరించారు. ఈ క్రమంలో ముఖ్యనేతల అభిప్రాయం మేరకు.. సమష్టి నిర్ణయంతో తొలి విడుదతలో నలుగురు అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఈ సందర్భంగా పార్లమెంట్‌ ఎన్నికల బరిలో నిలువబోతున్న అభ్యర్థులకు కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

మహానాయకుడు ఎన్టీఆర్ వంటి నేతకే ఒడిదుడుకులు తప్పలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి కనీసం 100 రోజులు కూడా అప్పుడే ప్రభుత్వం పై ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని తెలిపారు. ఆ వ్యతిరేకతను బీఆర్ఎస్ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ నేతలే కొట్టుకుంటారని కీలక వ్యాఖ్యలు చేశారు కేసీఆర్. ప్రజల తరుపున ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకావం మనకు వచ్చిందని.. ప్రతిపక్షం దెబ్బ ఎలా ఉంటుందో ప్రభుత్వానికి చూపిద్దామని పిలుపునిచ్చారు.

Also Read :  స‌నాత‌న ధ‌ర్మంపై ఉద‌య‌నిధి వ్యాఖ్య‌ల‌ గురించి సుప్రీంకోర్టు ఏమందో తెలుసా ?

Visitors Are Also Reading