Home » స‌నాత‌న ధ‌ర్మంపై ఉద‌య‌నిధి వ్యాఖ్య‌ల‌ గురించి సుప్రీంకోర్టు ఏమందో తెలుసా ?

స‌నాత‌న ధ‌ర్మంపై ఉద‌య‌నిధి వ్యాఖ్య‌ల‌ గురించి సుప్రీంకోర్టు ఏమందో తెలుసా ?

by Anji
Ad

స‌నాత‌న ధ‌ర్మంపై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన త‌మిళ‌నాడు మంత్రి ఉద‌య‌నిధి స్టాలిన్‌ పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేసింది. జ‌స్టిస్ సంజీవ్ ఖ‌న్నా, దీపాంక‌ర్ ద‌త్తాల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఇవాళ ఉద‌య‌నిధి పిటీష‌న్‌ను విచారించింది. వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసి మ‌ళ్లీ కోర్టును ఎలా ఆశ్ర‌యిస్తున్నార‌ని సుప్రీం బెంచ్ తీవ్రంగా ప్ర‌శ్నించింది. మీరు మాట్లాడే మాట‌ల ప‌ర్యవ‌సానాలు ఎలా ఉంటాయో మీకు తెలిసి ఉండాల‌ని కోర్టు తెలిపింది.

Advertisement

Advertisement

రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 19(1) ప్ర‌కారం మీరు మీకు హ‌క్కును దుర్వినియోగం చేశార‌ని, ఆర్టిక‌ల్ 25 ప్ర‌కారం కూడా దుర్వినియోగం చేశార‌ని, కానీ ఇప్పుడు ఆర్టిక‌ల్ 32 ప్ర‌కారం మీరు సుప్రీంలో పిల్ దాఖ‌లు చేశార‌ని, మీరు మాట్లాడిన మాట‌ల ప‌ర్య‌వ‌సానాలు ఎలా ఉంటాయో మీకు తెలుసా, మీరేమీ సాధార‌ణ వ్య‌క్తి కాదు అని, మీరు మంత్రి అని, మాట‌ల ప‌ర్య‌వ‌సానాలు తెలిసి ఉండాల‌ని సుప్రీం బెంచ్ తెలిపింది. ఈ కేసును మార్చి 15వ తేదీకి వాయిదా వేశారు. గ‌త ఏడాది సెప్టెంబ‌ర్‌లో స‌నాత‌నం ధ‌ర్మంపై స్టాలిన్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. సామాజిక న్యాయం, స‌మాన‌త్వానికి స‌నాత‌న ధ‌ర్మం వ్య‌తిరేకం అన్నారు. దాన్ని నిర్మూలించాల‌న్నారు. ఆ వ్యాఖ్య‌ల‌పై బీజేపీ నేత‌లు సీరియ‌స్ అయ్యారు. స‌నాత‌న ధ‌ర్మాన్ని డెంగ్యూ, మ‌లేరియాతో పోల్చారాయ‌న‌.

Also Read :  దేశ ప్రజలే తన కుటుంబం.. ట్రెండింగ్ లో మోడీ పరివార్..!

Visitors Are Also Reading