Home » త్వరలో కెవ్వు కార్తీక్ పెళ్లి….అమ్మాయి ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు…!

త్వరలో కెవ్వు కార్తీక్ పెళ్లి….అమ్మాయి ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు…!

by AJAY
Ad

జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో కెవ్వు కార్తీక్ ఒకరు. మిమిక్రీ ఆర్టిస్టుగా కెరియర్ ను మొదలుపెట్టి అలా మిమిక్రీ ఆర్టిస్టుగా ఎన్నో షోలను ఇచ్చి తద్వారా జబర్దస్త్ కామెడీ షోలోకి కార్తీక్ ఎంట్రీ ఇచ్చాడు. జబర్దస్త్ కామెడీ షో లోకి ఎంట్రీ ఇచ్చిన అతి కొద్ది కాలంలో షో ద్వారా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. అలాగే కార్తీక్ కామెడీ టైమింగ్ తో ఎంతోమందిని నవ్వించాడు.

Advertisement

ఇలా ఈ షో ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న కార్తీక్ ఆ తర్వాత అనేక టీవీ షోలలో కూడా పాల్గొన్నారు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే బుల్లితెర ద్వారా ఎంతో గుర్తింపును సంపాదించుకున్న ఈ కమెడియన్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. మన లైఫ్ లోకి ఒక కొత్త వ్యక్తి వస్తే జీవితం మరింత ఆనందంగా మారుతుందని కొందరు చెప్పారని… బహుశా అది ఇదేనేమో అంటూ తన సోషల్ మీడియా అకౌంట్ లో రాసుకొచ్చాడు.

Advertisement

అలాగే నా జీవితంలోకి అడుగుపెడుతున్నందుకు నీకు థ్యాంక్యూ అని.. నీతో కొత్త లైఫ్ ను ప్రారంభించడానికి ఎంతగానో ఎదురుచూస్తున్నాను అని పేర్కొన్నాడు. అందులో భాగంగా కార్తీక్ తను పెళ్లి చేసుకోబోయే అమ్మాయితో కలిసి దిగిన ఫోటోలను షేర్‌ చేశాడు. అయితే ఆ అమ్మాయి మొహం కనిపించకుండా అమ్మాయి ఎవరా అనే దానిని సస్పెన్స్ గా ఉంచాడు. దాంతో ఆ అమ్మాయి ఎవరు అనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగిపోయింది.

Also read: హీరో నాగార్జునకు యాంకర్ అనసూయకి మధ్య ఉన్న ఈ సంబంధం గురించి మీకు తెలుసా..?

Visitors Are Also Reading