Home » కంగువా నుంచి క్రేజీ అప్‌డేట్.. 38 భాషల్లో విడుద‌లయ్యే తొలి పాన్ వరల్డ్ మూవీ..!

కంగువా నుంచి క్రేజీ అప్‌డేట్.. 38 భాషల్లో విడుద‌లయ్యే తొలి పాన్ వరల్డ్ మూవీ..!

by Anji

రజనీ కాంత్, కమల్ హాసన్  తర్వాత ఆ స్థాయిలో తెలుగులో క్రేజ్ ఉన్న తమిళ నటుడు ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు సూర్య. తమిళంలో సూర్యకు ఎంత పాపులారిటీ ఉందో తెలుగులో కూడా  అంతే ఉంది. ఆయన సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే ఇక్కడ కూడా భారీ రేంజ్ లో సెలబ్రేషన్స్‌ జరుగుతుంటాయి. కాగా గత కొంత కాలంగా సూర్య సినిమాలు కమర్షియల్‌గా సక్సెస్  కాలేకపోతున్నాయి.

గత ఏడాది భారీ అంచనాల మధ్య రిలీజైన ‘ఈటీ’ తొలిరోజే నెగెటీవ్ టాక్ తెచ్చుకుని డిజాస్టర్‌ ఫలితం మూటగట్టుకుంది. ప్రస్తుతం సూర్య ‘కంగువా’ అనే పీరియాడిక్ సినిమా చేస్తున్నాడు. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ప్రీ లుక్‌ పోస్టర్‌లు, గ్లింప్స్ సినిమాపై వీర లెవల్లో అంచనాలు క్రియేట్‌ చేశాయి. ఏడాది కిందట మొదలైన ఈ ప్రాజెక్ట్ శ‌ర‌వేగంగా షూటింగ్‌ను కంప్లీట్‌ చేసుకుంటుంది. ఇదిలా ఉంటే.. తాజాగా మూవీ నుంచి ఒక సాలిడ్ అప్‌డేట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ ఈ సినిమాను ప్ర‌పంచ‌వ్యాప్తంగా 38 భాషల్లో రిలీజ్ చేయబోతున్నట్లు స‌మాచారం.

ఇక ఇన్ని భాషల్లో రిలీజవుతున్న తొలి ఇండియన్ సినిమా ఇదే కావడం విశేషం. అంతేకాకుండా అన్ని భాషల్లో 3డీ వెర్షన్ కూడా రిలీజ్ కాబోతుందట. అయితే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. దిశా పటానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చుతున్నాడు. యూవీ క్రియేషన్స్‌, స్టూడీయో గ్రీన్‌ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఎప్పుడు వస్తుందోనని ఎంతో ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ హిట్ కావడం గ్యారెంటీ అని సూర్య అభిమానులు పేర్కొంటున్నారు. 

మరిన్ని టాలీవుడ్ న్యూస్  కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading