Home » చిరంజీవి తలుచుకుంటే తమిళంలో పెద్ద స్టార్ అయ్యేవాడు.. కమల్ హాసన్ కామెంట్స్ వైరల్

చిరంజీవి తలుచుకుంటే తమిళంలో పెద్ద స్టార్ అయ్యేవాడు.. కమల్ హాసన్ కామెంట్స్ వైరల్

by Anji
Published: Last Updated on

నటుడు కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన ఇండియన్ బెస్ట్ యాక్టర్స్ లో టాప్ లో ఉంటారు. అందుకే ఆయనను నటనలో లోక నాయకుడు అని పిలుస్తారు. కోలీవుడ్ ని కొన్నేళ్లపాటు శాసించిన హీరో.. ఆర్ట్ ని, కమర్షియల్ అంశాలను బ్లెండ్ చేసి సినిమాలు చేసి హిట్ కొట్టిన ఘనత ఆయన ఒక్కడికే దక్కుతుంది. అటు ప్రయోగాలు, ఇటు కమర్షియల్ హిట్లు చేసి సక్సెస్ అయ్యారు. ఇప్పటికీ అదే క్రేజ్ రేంజ్ తో రాణిస్తున్నారు.

మరోవైపు మెగాస్టార్ చిరంజీవి కమర్షియల్ సినిమాకి కేరాఫ్. తెలుగు సినిమాకే కమర్షియాలిటీని పరిచయం చేసి, సినిమాలకు థియేటర్ల వద్ద కాసుల వర్షం కురిపించిన నటుడు. హీరోయిజాన్ని నటనను మిక్స్ చేసి మెప్పించడం ఆయన ప్రత్యేకత. డ్యాన్స్ లతో తెలుగు ఆడియన్స్ ని ఉర్రూతలూగించారు. టాలీవుడ్ కి ఎంత మంది వచ్చినా అదే క్రేజ్ తో రాణిస్తున్నారు మెగాస్టార్. చిరంజీవి పై కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిరంజీవి తలుచుకుంటే కోలీవుడ్ లో కూడా పెద్ద స్టార్ అయ్యేవాడు. కానీ ఆ సమయంలో ఆయన కోలీవుడ్ పై పెద్దగా ఆసక్తి చూపించలేదు అని పేర్కొన్నారు కమల్ హాసన్. గతంలో ఎప్పుడో కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడం విశేషం.

 

Visitors Are Also Reading