నందమూరి కుటుంబం నుంచి చాలా మంది హీరోలుగా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. వీరిలో కొంత మంది మాత్రమే హీరోలుగా సక్సెస్ అయ్యారు. మిగతా వారు కేవలం రెండు మూడు సినిమాలకే పరిమితమయ్యారు. ప్రస్తుతం బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్ వీరు ముగ్గురు మినహా మిగతా వారు అంతగా ఆకట్టుకోలేకపోయారనే చెప్పాలి. ఇక బాలకృష్ణ విషయానికి వస్తే ఆయన తన కెరీర్లో 100కి పైగా సినిమాలు తీశారు. ఇంకా టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరిగా కొనసాగుతూనే ఉన్నారు. ఇటీవలే విడుదలైన అఖండ ఎంతటి విజయం సాధించిందో ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఎన్టీఆర్ కూడా తాతకు తగ్గ మనమడు మాదిరిగా అదే పేరుతో అదే నటనతో అందరినీ మెప్పిస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఇటీవలే ఆర్ఆర్ఆర్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. నందమూరి వంశం నుంచి అడుగుపెట్టిన హీరోల్లో కళ్యాణ్ రామ్ ఒకరు. కళ్యాణ్ రామ్ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపునే సంపాదించుకున్నారు. చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న కళ్యాణ్‌రామ్ ప్రస్తుతం బింబిసారా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్, టీజర్ విడుదలై ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఇటీవల నిర్వహించిన బింబిసారా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇక ఈ సినిమా ఆగస్టు 05న ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.
Advertisement
Advertisement
ఈ తరుణంలో బింబిసార సినిమా ప్రమోషన్ పనులు ప్రారంభించారు. సినిమా ప్రమోషన్లలో భాగంగా కళ్యాణ్‌రామ్ ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ తరుణంలో బింబిసార సినిమా భారీ బడ్జెట్‌తో నిర్మించినట్టు తెలుస్తోంది. బింబిసారను బాహుబలి లైన్లో చేర్చి మరో బాహుబలి తరువాత అంతటి బిగ్ మూవీ అనుకోవచ్చా..? అని యాంకర్ కళ్యాణ్ రామ్ ని ప్రశ్నించగా..? ఈ ప్రశ్నకు కళ్యాణ్ రామ్ సమాధానం చెబుతూ దయచేసి బింబిసార సినిమాని బాహుబలితో పోల్చకండి. ఆ సినిమా వందల కోట్ల భారీ బడ్జెట్ వరకు వెళ్లింది. ఈ సినిమా మాకు ఉన్న బడ్జెట్ పరిధిలో రిచ్‌గా రూపొందించామంటూ చెప్పారు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. చాలా కాలం తరువాత ప్రేక్షకుల ముందుకొస్తున్న కళ్యాణ్ రామ్ బింబిసార హిట్ అందుకుంటుందో లేదో తెలియాలంటే ఆగస్టు 05 వరకు వేచి చూడాల్సిందే..!
Also Read :
అరుంధతి సినిమా స్టోరీ ఎలా పుట్టిందంటే ? నిర్మాత శ్యామ్ ప్రసాద్ కి ఎదురైన ఆ సంఘటన …!
పెళ్లి పీటలు ఎక్కబోతున్న అడివి శేష్.. అమ్మాయి అక్కినేని కొడలేనా..?