Home » అరుంధతి సినిమా స్టోరీ ఎలా పుట్టిందంటే ? నిర్మాత శ్యామ్ ప్రసాద్ కి ఎదురైన ఆ సంఘటన …!

అరుంధతి సినిమా స్టోరీ ఎలా పుట్టిందంటే ? నిర్మాత శ్యామ్ ప్రసాద్ కి ఎదురైన ఆ సంఘటన …!

by AJAY
Ad

సూప‌ర్ సినిమాతో టాలీవుడ్ కు ప‌రిచ‌యమైన ముద్దుగుమ్మ అనుష్క స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాల్లో న‌టించి అభిమానుల‌ను సంపాదించుకుంది. వ‌రుస సూప‌ర్ హిట్ లు అందుకోవ‌డంతో హీరోల రేంజ్ లో అనుష్క క్రేజ్ ను సంపాదించుకుంది. ఇప్ప‌టికీ అనుష్క కోసం సినిమాల‌కు వెళ్లే ప్రేక్ష‌కులు ఉన్నారంటే ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ను సంపాదించుకుందో అర్థం చేసుకోవచ్చు. కెరీర్ ప్రారంభంలో కేవ‌లం హీరోల ప‌క్క‌న సినిమాలు చేసిన అనుష్క ఆ త‌ర‌వాత లేడీ ఓరియంటెడ్ చిత్రాల‌తోనూ అద‌రగొట్టింది.

Advertisement

అనుష్క లీడ్ రోల్ చేసిన అరుంధ‌తి సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఈ సినిమాలో అనుష్క న‌ట‌న‌కు అంతా ఫిదా అయ్యారు. ఈ చిత్రాన్ని శ్యాం ప్ర‌సాద్ రెడ్డి నిర్మించారు. కోడి రామ‌కృష్ణ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇదిలా ఉండ‌గా ఈ సినిమాకు తెర‌వెన‌క చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ న‌డిచింది. ఓ పార్టీలో నిర్మాత శ్యాంప్ర‌సాద్ రెడ్డి బంధువు ప‌దే ప‌దే గ‌ద్వాల్ కోట గురించి మాట్లాడుతండ‌గా ఆయ‌నకు ఆస‌క్తిక‌రంగా అనిపించిందట‌.

Advertisement

Arundhati

Arundhati

అంతే కాకుండా చిన్న‌ప్పుడు శ్యాం తాత కూడా ఓ కోట గురించి చెబుతూ.. కోట‌లో రాజ‌కుమారి పనివాడితో ఉండ‌గా చూసిన రాజు ఇద్ద‌రినీ చంపేసి అదే గ‌దిని స‌మాధి చేశాడ‌ని చెప్పాడ‌ట‌. ఈ రెండింటిని మూలంగా చేసుకుని సినిమా చేయాల‌ని శ్యాం ప్ర‌సాద్ నిర్ణ‌యించుకున్నారట‌. అప్ప‌టికే అంజి ఫ్లాప్ తో ఉన్న‌ప్ప‌టికీ మ‌రోసారి కూడా విజువ‌ల్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉండే సినిమానే చేయాల‌ని నిర్న‌యం తీసుకున్నార‌ట‌.

Anushka Shetty

Anushka Shetty

ఆ త‌ర‌వాత ద‌ర్శ‌కుడు కోడి రామ‌కృష్ణ‌ను పిలిచి క‌థ‌ను డెవ‌ల‌ప్ చేశారు. ఆ త‌వ‌రాత అనుష్క‌ను హీరోయిన్ గా తీసుకున్నారు. ఇక సినిమాలో కోట కోసం రూ.80 కోట్ల సెట్ ను వేశారు. అంతే కాకుండా అనుష్క కూడా ఈ సినిమా కోసం ఎంతో క‌ష్ట‌ప‌డింది. అనుష్క‌, ద‌ర్శ‌క‌నిర్మాత‌ల క‌ష్టానికి ఫ‌లితంగా ఈ చిత్రం బ్లాక్ బస్ట‌ర్ అయ్యింది.

ALSO READ : తన డ్రస్సింగ్ పై వ్యంగంగా కామెంట్స్ చేసిన నెటిజెన్ కి అద్దిరి పోయే పంచ్ !

Visitors Are Also Reading