Home » పెళ్లి పీటలు ఎక్కబోతున్న అడివి శేష్.. అమ్మాయి అక్కినేని కొడలేనా..?

పెళ్లి పీటలు ఎక్కబోతున్న అడివి శేష్.. అమ్మాయి అక్కినేని కొడలేనా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

మొన్నటి వరకు హీరో అడవి శేష్ అంటే ఎవరికీ తెలియదు.. ఇప్పటికే చాలా సినిమాల్లో నటించారు కానీ అంతగా పేరు రాలేదు. గూడచారి, క్షణం వంటి విభిన్న కథలతో మూవీస్ చేసి హీరోగా కాస్త గుర్తింపు తెచ్చుకున్న, మేజర్ మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టి పాన్ ఇండియా లెవెల్ లో పాపులర్ అయిపోయారు అడివి శేష్. ఈ తరుణంలోనే హిట్ సీక్వెల్ చిత్రాల్లో నటిస్తూ చాలా బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన గురించి ఒక వార్త మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అడివి శేష్ వివాహం చేసుకోబోతున్నారని వార్త చక్కర్లు కొడుతోంది.

Advertisement

అయితే ఇండస్ట్రీలో ఇలాంటి వార్తలు సర్వసాధారణమే కానీ అడివి శేష్ అక్కినేనివారి కోడలు సుప్రియని పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు రావడం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని త్వరలో పెళ్లితో ఒక్కటి కాబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే సుప్రియ పవన్ కళ్యాణ్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో హీరోయిన్ గా చేసి తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది. ఈమె వివాహం చేసుకుని తన భర్తతో విడాకులు తీసుకొని ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియో బాధ్యతలు చూసుకుంటోంది. అయితే అడవి శేషు గూడచారి సినిమాలో నటనలోకి రీ ఎంట్రీ ఇచ్చారు సుప్రియ.

Advertisement

అయితే వీరిద్దరూ సినిమాల్లోకి రాకముందే మధ్య స్నేహితులని ఆ స్నేహమే ప్రేమగా మారిందని వార్తలు వస్తున్నాయి. అయితే వీటన్నింటిపై హీరో అడవి శేషు స్పందించారు. ఆ వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని, తమ తల్లిదండ్రులు తనకు సంప్రదాయబద్ధమైన తెలుగు అమ్మాయితో పెళ్లి చేయాలనుకుంటున్నారని సమాధానమిచ్చారు. ఈ విధంగా ఆయన తన గురించి వస్తున్న వార్తలకు చెక్ పెట్టారు.

ALSO READ:

Visitors Are Also Reading