Home » ఎన్టీఆర్, చరణ్ అభిమానులకు క్షమాపణలు చెప్పిన కాలబైరవ.. ఎందుకంటే ? 

ఎన్టీఆర్, చరణ్ అభిమానులకు క్షమాపణలు చెప్పిన కాలబైరవ.. ఎందుకంటే ? 

by Anji
Ad

దర్శక ధీరుడు తెరకెక్కించిన RRR సినిమా ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డును గెలుచుకొని స్వదేశంలో గర్వంగా అడుగుపెట్టింది టీమ్. తొలుత ఎన్టీఆర్ మార్చి 16న హైదరాబాద్ కి చేరుకోగా.. మార్చి 17న రామ్ చరణ్-ఉపాసన దంపతులు, రాజమౌళి, రమ దంపతులు, కీరవాణి, కాలబైరవ, కార్తికేయ వంటి చిత్ర బృందం ఢిల్లీకి చేరుకుంది. ఈసందర్భంగా RRR యూనిట్ కి అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఇదిలా ఉంటే.. నాటు నాటు పాటకు ఆస్కార్ దక్కడం.. అక్కడి వేదికపై లైవ్ పెర్పామెన్స్ ఇవ్వడంపై సింగర్ కాలబైరవ హర్షం వ్యక్తం చేసారు.  

Also Read :  Iratta Movie : దుమ్ము లేపుతున్న “ఇరట్ట” చిత్రం మీరు చూశారా?

Advertisement

ఇక సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని షేర్ చేసుకున్నారు. RRR లో భాగమై బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరి కోసం ఆస్కార్స్ లో పెర్పార్మెన్స్ ఇచ్చే అవకాశం వచ్చినందుకు కృతజ్ఞతుడిగా భావిస్తున్నా. ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించడం వల్లనే ఈ ఘనత సాధ్యం అయింది. రాజమౌళి బాబా, నాన్న, ప్రేమ్ రక్షిత్ మాస్టర్, ఎస్ఎస్ కార్తికేయ అన్న,వారందరి కృషి వల్లనే ఈ పాట విశ్వవ్యాప్తం అయింది. ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేమికులతో, సంగీత ప్రియులతో డ్యాన్స్ చేయించింది నాటు నాటు పాట అని అందరికీ థాంక్స్ చెప్పారు కాలబైరవ. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఈ పోస్ట్ లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ పేర్లను ప్రస్తావించడం మరిచిపోయాడు కాలబైరవ. 

Advertisement

Also Read :  Pathaan : ‘పఠాన్’ మూవీ ఓటిటి డేట్ లాక్… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

దీంతో వారి అభిమానులు కాలబైరవ పై మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా తనపై వస్తున్న నెగెటివిటీని గ్రహించిన కాలబైరవ వెంటనే మరో పోస్ట్ చేశాడు. “ నాటు నాటు RRR ఇంత విజయవంతం అవ్వడానికి తారక్ అన్న, చరణ్ అన్నలే కారణం అని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. అయితే అకాడమీ వేదికపై ప్రదర్శనల అవకాశం రావడానికి నావైపు ఎవరెవరు సహకరించారనేది నేను మాత్రమే మాట్లాడాను. అంతకు మించి ఇంకా ఏమీ లేదు. అది తప్పుగా అర్థం అయింది. ఇందుకు క్షమాపణలు కోరుతున్నా” అని ట్వీట్ చేశారు కాలబైరవ. ఆస్కార్ వేడుకలో నాటునాటు పాటకు లైవ్ పెర్ఫామెన్స్ తో అదురగొట్టారు కాలబైరవ, రాహుల్ సిప్లిగంజ్. వీళ్ల పాటకు హాలీవుడ్ డ్యాన్సర్లు సైతం స్టేజీ పెర్పామెన్స్ అందరినీ ఆకట్టుకున్నారు. 

Also Read :  రెండో పెళ్లికి రెడీ అవుతున్న సింగ‌ర్ కౌస‌ల్య‌…వ‌రుడు ఎవ‌రో ఏం చేస్తాడో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Visitors Are Also Reading