Telugu News » Blog » Pathaan : ‘పఠాన్’ మూవీ ఓటిటి డేట్ లాక్… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Pathaan : ‘పఠాన్’ మూవీ ఓటిటి డేట్ లాక్… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

by Bunty
Ads

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలాఏళ్ల నుంచి సరైన హిట్ లేక సతమతమవుతున్న షారుఖ్ కు ఈ సినిమా భారీ విజయాన్ని అందించింది. సిద్ధార్థ్ దర్శకత్వంలో సినిమా బాక్సాఫీస్ ముందు వండర్స్ క్రియేట్ చేసింది. జనవరి 25వ తేదీన విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్ల రూపాయల వసూళ్లను సాధించడమే కాకుండా

Advertisement

READ ALSO : తరుణ్ – ఆర్తి లవ్ విషయం తెలిసిన తర్వాత వారి పేరెంట్స్ రియాక్షన్ ఇదే..!

Advertisement

అత్యధిక వసుళ్లు సాధించిన హిందీ సినిమాగా రికార్డు సృష్టించి, బాహుబలి రికార్డులను బద్దలు కొట్టింది. తొలిరోజే అనుకుంటే వరుసగా ఆరు రోజులు 100 కోట్ల గ్రాస్ కు దిగకుండా కలెక్షన్లు రాబడుతూ బాలీవుడ్ బాక్సాఫీస్ కు ఊపిరి పోసింది. షారుక్ ఖాన్ యాక్షన్, దీపిక అందాలు, జాన్ అబ్రహం విలనిజం ప్రేక్షకులను థియేటర్లకు రిపీటెడ్ గా వచ్చేలా చేశాయి. బాహుబలి-2 పేరిట ఉన్న ఐదేళ్ల రికార్డును బద్దలు కొట్టి, బాలీవుడ్ లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా సంచలనం సృష్టించింది.

READ ALSO : కె.విశ్వనాథ్ మృతి..ఆయన మరణానికి అసలు కారణం ఇదే…!

The wait for Shah Rukh Khan fans is over; Soon Pathaan will be coming on 'Ya' OTT

ఇలా చెప్పుకుంటూ పోతే పఠాన్ మూవీ ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. ఇదిలా ఉంటే ఈ సినిమా డిజిటల్ రిలీజ్ కోసం ఓటిటి ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటిటి అమెజాన్ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసింది. కాగా ఈ సినిమా మార్చి 25 నుంచి ఓటిటిలో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం ఈ సినిమా అందుబాటులో ఉండనుంది.

Advertisement

READ ALSO : బాలయ్య వివాదాస్పద వ్యాఖ్యలు.. రంగంలోకి దిగిన ఎస్వీఆర్ మనవాళ్లు