Home » కాజల్ అగర్వాల్ కొత్త సినిమా “సత్య భామ” టీజర్ రిలీజ్.. అదిరిపోయిందిగా..!

కాజల్ అగర్వాల్ కొత్త సినిమా “సత్య భామ” టీజర్ రిలీజ్.. అదిరిపోయిందిగా..!

by Srilakshmi Bharathi
Ad

గౌతమ్ కిచ్లు తో వివాహం.. తక్కువ గ్యాప్ లోనే ఓ బేబీ కూడా పుట్టేయడంతో కాజల్ అగర్వాల్ సినిమాలకు కొంత బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ జోరు పెంచారు. బాబు పుట్టిన తరువాత ఆమె అందం మరింత పెరిగినట్లయింది. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ నటించిన “సత్య భామ” సినిమా టీజర్ నెట్టింట్లో సందడి చేస్తోంది. ఈ సినిమాలో కాజల్ లుక్ పూర్తి డిఫరెంట్ గా ఉంది. ఆమె లోని వయొలెన్స్ ప్రేక్షకులకు కూడా కొత్తగా కనిపిస్తుంది.

Advertisement

స్టార్ హీరోయిన్ గా పేరు పొందిన కాజల్ అగర్వాల్ తెలుగు నాట ఇంచుమించు అందరు స్టార్ హీరోల సరసన నటించారు. ప్రస్తుతం ఆమె దృష్టి లేడీ ఓరియెంటెడ్ సినిమాలపైన ఉన్నట్లు ఉంది. ఆమె నటిస్తున్న “సత్య భామ” సినిమా ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ. ఈ సినిమా కాకుండా ఆమె తమిళ్ లో ‘గోస్టీ’, ‘కరుంగాపియం’ సినిమాల్లో నటించారు. తెలుగు లో ఆమె బాలయ్య సరసన నటించిన “భగవంత్ కేసరి” సినిమా కూడా మంచి ఫలితాన్ని రాబట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆమె సైకలాజిస్ట్ కాత్యాయని‌గా కనిపించారు.

Advertisement

సత్య భామ సినిమాలో మాత్రం కాజల్ అగర్వాల్ టైటిల్ రోల్ ను పోషిస్తున్నారు. ఈ సినిమాలో ఆమె ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఎసిపి సత్యభామగా తన ఉగ్రరూపం చూపించడానికి కాజల్ అగర్వాల్ సిద్ధం అయ్యారు. “సత్య భామ” ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్‌ సినిమాగా రూపొందుతోంది. ఈరోజు రెండు నిమిషాల నిడివి ఉన్న టీజర్ ను విడుదల చేసారు. ఈ టీజర్ విడుదల చేసిన కొద్దీ సేపటికే వైరల్ అయ్యింది. “అమాయకురాలైన ఓ యువతిని హత్య చేసిన కేసు గురించి సత్యభామ పని చేస్తూ ఉంటుంది. వేటాడే సింహంలా ఆమె ఈ సినిమాలో కనిపించనుంది. “సత్యా ఈ కేసు నీ చేతిలో లేదు..” అన్న డైలాగ్ కు “ప్రాణం నా చేతిలోనే పోయింది సార్” అని సమాధానం ఇస్తుంది కాజల్. ఆమె ఈ కేసుని క్లోజ్ చేసిందా లేదా, చివరకు ఏమైంది అన్నది సినిమాలోనే తెలుస్తుంది. మొత్తానికి కాజల్ ను పవర్ ఫుల్ రోల్ లో చూడడానికి అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

Read More:

Mohammed Shami : పాకిస్తాన్ క్రికెటర్ పై షమీ ఫైర్… “కొంచెమైనా సిగ్గుండాలి”.. !

మరో స్టార్ జంట విడాకులు…కారణం ఇదే !

బేబీ బంప్‌తో ప్ర‌త్య‌క్ష‌మ‌యిన అనుష్క శ‌ర్మ‌…వీడియో వైరల్ !

Visitors Are Also Reading