Home » బేబీ బంప్‌తో ప్ర‌త్య‌క్ష‌మ‌యిన అనుష్క శ‌ర్మ‌…వీడియో వైరల్ !

బేబీ బంప్‌తో ప్ర‌త్య‌క్ష‌మ‌యిన అనుష్క శ‌ర్మ‌…వీడియో వైరల్ !

by Bunty
Ad

విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అండర్ 19 కెప్టెన్ గా కెరీర్ ప్రారంభించిన విరాట్ కోహ్లీ ఆ తర్వాత టీమిండియాలోకి వచ్చాడు. టీమిండియాలోకి వచ్చి రాగానే కెప్టెన్ కూడా అయిపోయాడు. కెప్టెన్ గా టీమిండియా కు ఎన్నో విజయాలు అందించిన విరాట్ కోహ్లీ… ప్రస్తుతం సాధారణ ప్లేయర్ గా కొనసాగుతున్నాడు. ఇక ప్రస్తుతం ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 పోరులో కూడా టీమిండియా కోసం చాలా కష్టపడుతున్నాడు విరాట్ కోహ్లీ.

Anushka Sharma clicked flaunting a baby bump during her outing with Virat Kohli in Bengaluru

అయితే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్లో బిజీగా ఉన్న విరాట్ కోహ్లీ తన ఫ్యాన్స్ కు అదిరిపోయే శుభవార్త చెప్పాడు. విరాట్ కోహ్లీ రెండవసారి తండ్రి కాబోతున్నాడు. ఇప్పటికే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా… తాజాగా మరోసారి దీనిపై క్లారిటీ వచ్చేసింది. విరాట్ కోహ్లీ మరియు అనుష్క శర్మ తాజాగా బెంగళూరులో కనిపించారు. బెంగళూరులోని హోటల్ లో బేబీ బంప్ తో అనుష్క శర్మ కూడా ప్రత్యక్షమయ్యారు. దీంతో విరాట్ కోహ్లీ మరియు అనుష్క శర్మ మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు రాస్తున్నారు.

Advertisement

Advertisement

అయితే ఇప్పటివరకు ఈ జంట దీనిపై అధికారిక ప్రకటన మాత్రం చేయలేదు. త్వరలోనే తన ప్రేగ్నేన్సిపై అధికారిక ప్రకటన కూడా అనుష్క శర్మ చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం అందుతోంది. కాగా 2017 సంవత్సరంలో అనుష్క శర్మ మరియు విరాట్ కోహ్లీ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 2021 సంవత్సరంలో ఈ జంటకు వామిక అనే కూతురు పుట్టింది. ఇక ఇప్పుడు మరో మారు ఈ జంట తల్లిదండ్రులు కాబోతున్నారన్నమాట.

మరిన్ని  క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి !  తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.

Visitors Are Also Reading