Home » మరో స్టార్ జంట విడాకులు…కారణం ఇదే !

మరో స్టార్ జంట విడాకులు…కారణం ఇదే !

by Bunty
Ad

భాషతో సంబంధం లేకుండా చాలామంది వివాహం చేసుకొని, ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకుంటున్నారు. సూపర్ స్టార్స్ సైతం తమ వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పి ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. ఈ కోవలోకె ఓ సూపర్ స్టార్ జంట వచ్చి చేరింది. బాలీవుడ్ స్టార్ సింగర్ యో యో హనీ సింగ్ తెలియని అభిమాని ఉండరు. ఆయన తన పాటలతో అభిమానులను అలరించారు. ముఖ్యంగా తన పాటలతో ఎంతో హైప్ తీసుకొని వచ్చాడు.

Honey Singh Divorce

అయితే హనీ సింగ్ వైవాహిక జీవితం ఒడిదోడుకులకు లోనైందని చెప్పాలి. 2011లో శాలిని తల్వార్ ను పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరూ పదేళ్లపాటు కలిసి జీవించారు. మొదట్లో వీరిద్దరూ చాలా సంతోషంగా గడిపారు. కానీ కొన్నిరోజులకి ఇద్దరి మధ్య అభిప్రాయబేధాలు తలెత్తాయి. నిత్యం గొడవలతో మీడియా కంట కూడా పడ్డారు. 2021 నుంచి ఈ జంట దూరంగా ఉంటున్నారు. ఆ తర్వాత శాలిని తల్వార్ తన భర్త వేధిస్తున్నాడని హనీ సింగ్ పై గృహహింస కేసు పెట్టింది.

Advertisement

Advertisement

ఆ సమయంలోనే తన భర్తకు వేరే అమ్మాయితో సంబంధం ఉందని శాలిని తల్వార్ తన భర్తపై సంచలన ఆరోపణలు చేసింది. ఆ కారణంగానే 2021లో కోర్టును ఆశ్రయించిన శాలిని తల్వార్ భర్త నుంచి విడాకులు కావాలని అప్లై చేసింది. తాజాగా ఢిల్లీ కోర్టు హనీసింగ్ కు విడాకులు మంజూరు చేసింది. హనీసింగ్ ని తన భార్యకు భరణం ఇవ్వాల్సిందిగా కోర్టు చెప్పగా… హనీ సింగ్ కోటి రూపాయల చెక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికి మరో స్టార్ జంట విడాకులు తీసుకోవడం బాలీవుడ్ ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading