Home » Mohammed Shami : పాకిస్తాన్ క్రికెటర్ పై షమీ ఫైర్… “కొంచెమైనా సిగ్గుండాలి”.. !

Mohammed Shami : పాకిస్తాన్ క్రికెటర్ పై షమీ ఫైర్… “కొంచెమైనా సిగ్గుండాలి”.. !

by Bunty
Ad

వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా టాప్ గేర్ లో దూసుకుపోతోంది. వరుస విజయాలతో పాయింట్స్ టేబుల్ లో టాప్ ప్లేస్ లో ఉంది. సమిష్టిగా విజయాలను రాణిస్తుండడంతో పాయింట్స్ టేబుల్ లో ముందు వరుసలో ఉంది. అయితే టీం ఇండియాను చూసి దాయాది దేశం పాకిస్తాన్ కుళ్ళుకుంటుంది. ఆ టీం మాజీ ప్లేయర్లు ఏకంగా భారత జట్టు చీటింగ్ చేస్తుందని అబండాలు వేస్తున్నారు. టీమిండియా బౌలింగ్ చేసే సమయానికి బంతిని మార్చేస్తున్నారంటూ పాకిస్తాన్ క్రికెటర్ హాసన్ రజా సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.

Mohammed Shami bashes Pakistan’s Hasan Raza for his claims of India using altered cricket balls

టీమిండియా బౌలర్లు బంతి వేసినప్పుడు బంతి ఎక్కువగా స్వింగ్ అవుతుందంటూ లేనిపోని అనుమానాలను క్రియేట్ చేశారు. ఈ క్రమంలో శ్రీలంకను భారత జట్టు 55 పరుగులకే ఆల్ అవుట్ చేసిందని రగిలిపోయారు. అయితే హసన్ రజా కామెంట్స్ ను ఫాన్స్ తిప్పి కొట్టారు. తాజాగా ఈ గొడవల్లోకి మహమ్మద్ షమీ ఎంట్రీ ఇచ్చాడు. టీమిండియా బౌలర్లపై రజా కామెంట్స్ పై స్పందించిన షమీ చెంప చెల్లుమనిపించాడు. హసన్ రజా ఫోటోను తన ఇన్స్టాలో షేర్ చేస్తూ పిచ్చి మాటలు మాట్లాడడానికి సిగ్గుండాలి అంటూ సీరియస్ అయ్యాడు. చెత్త వాగుడు వాడడం కన్నా ఆటపై ఫోకస్ పెడితే బాగుంటుంది.

Advertisement

Advertisement

అప్పుడప్పుడు అయిన ప్రత్యర్థి సక్సెస్ ను ఎంజాయ్ చేయడం నేర్చుకో అంటూ చురకలు అంటించాడు. ఇది వరల్డ్ కప్… మీ లోకల్ టోర్నమెంట్ కాదంటూ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేసాడు. అయితే హసన్ రజా చేసిన అబద్ధపు కామెంట్స్ పై పాకిస్తాన్ స్వింగ్ సుల్తాన్ వసీమ్ అక్రమ్ మండిపడ్డాడు. ఇలాంటి చెత్త వాగుడుతో నీ పరువు తీసుకోవడమే కాకుండా కాదు, అందరి ముందు పాకిస్తాన్ పరువు కూడా తీసావ్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇదిలా ఉంటే….మెగా టోర్నీలో షమీ నిప్పులు చెరుగుతున్నాడు. కేవలం నాలుగు మ్యాచుల్లోనే 16 వికెట్లు పడగొట్టాడు. ఒక ఇన్నింగ్స్ లో రెండుసార్లు 5 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు.

మరిన్ని  క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి !  తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.

Visitors Are Also Reading