Home » మాలీవుడ్ స్టార్ హీరోతో జ్యోతిక ల‌వ్‌స్టోరి..!

మాలీవుడ్ స్టార్ హీరోతో జ్యోతిక ల‌వ్‌స్టోరి..!

by Anji
Ad

 

దాదాపు ద‌శాబ్దం కింద‌ట‌ తెలుగు, త‌మిళ భాష‌ల్లో టాప్ హీరోయిన్ కొన‌సాగిన వారిలో జ్యోతిక ఒక‌రు. ఈమె కోలీవుడ్‌, టాలీవుడ్ ల‌లో చాలా సినిమాలు చేసింది. చిరంజీవి, నాగార్జున వంటి అగ్ర‌హీరోల స‌ర‌స‌న న‌టించింది. ఆ త‌రువాత జ్యోతిక సినీ కెరీర్ మంచి ఫామ్ లో ఉన్న స‌మ‌యంలోనే కోలీవుడ్ స్టార్ హీరో సూర్యను వివాహం చేసుకుని సెటిల్ అయింది. సూర్య-జ్యోతిక జంట కేవలం కోలీవుడ్ లోనే కాదు.. దేశ‌వ్యాప్తంగా అంద‌రితో క్యూట్ కపుల్ అని పేరు తెచ్చుకున్నారు.

Aso Read : అఖండ ను టచ్ చేయలేకపోయిన గాడ్ ఫాదర్….! చిరు ను బాలయ్య వెనక్కి నెట్టేశాడా….?

Advertisement

పెళ్లి తరువాత ఈ అలనాటి స్టార్ హీరోయిన్ ఇటీవల సిల్వర్ స్క్రిన్ పైకి రీ ఎంట్రీ ఇచ్చింది. వరుసగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూ వచ్చింది. తాజాగా జ్యోతిక ఒక లవ్ స్టోరీ చేయడానికి సిద్ధమైంది. మాలీవుడ్ సీనియర్ హీరో మమ్ముట్టితో జ్యోతిక ఒక ప్రేమకథలో నటిస్తోంది. ఈ చిత్రానికి కాదల్ అనే టైటిల్ ను ఖరారు చేసిన‌ట్టు స‌మాచారం. ఇటీవ‌లే ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు. బ్లాక్ అండ్ వైట్ ఉన్న ఓ ఫోటోలో జ్యోతిక, మమ్ముట్టి కనిపిస్తున్నారు. దీన్ని చూస్తే క్లాసిక్ ఫీలింగ్ కలుగుతుంది.

Advertisement

Also Read : ఆ ఒక్క కారణం వల్ల వేటగాడు లో ఎన్టీఆర్ పక్కన నటించనని చెప్పిన శ్రీదేవి…..! దాంతో ఎన్టీఆర్ ఏం చేశారో తెలుసా..?

ఈ చిత్రాన్ని కోలీవుడ్ డైరెక్టర్ బేబి తెరకెక్కిస్తున్నాడు. అదేవిధంగా మమ్ముట్టి సొంత నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్నినిర్మిస్తోంది. తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి ఈ చిత్రం తెర‌కెక్క‌నుంది. అయితే జ్యోతిక, మమ్ముట్టి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులే. దీంతో ఈ చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేయాల‌నుకుంటున్న‌ట్టు స‌మాచారం. తెలుగులో ఈ సినిమా విడుద‌ల‌వుతుందో లేదో వేచి చూడాలి మ‌రి.

Also Read : గీతాఆర్ట్స్‏లో ‘గీతా’ వెనుక ఉన్న కథ ఇదే.. అసలు విషయం చెప్పిన అల్లు అరవింద్

 

Visitors Are Also Reading