Home » ఆ ఒక్క కారణం వల్ల వేటగాడు లో ఎన్టీఆర్ పక్కన నటించనని చెప్పిన శ్రీదేవి…..! దాంతో ఎన్టీఆర్ ఏం చేశారో తెలుసా..?

ఆ ఒక్క కారణం వల్ల వేటగాడు లో ఎన్టీఆర్ పక్కన నటించనని చెప్పిన శ్రీదేవి…..! దాంతో ఎన్టీఆర్ ఏం చేశారో తెలుసా..?

by AJAY
Ad

ఒక్కో ఇండస్ట్రీలో ఒక్కో లెజెండ్ ఉంటారు. అలా తెలుగులో ఎన్టీరామారావు ఓ లెజెండ్ అనే చెప్పాలి. మిడిల్ క్లాస్ నుండి వచ్చిన ఎన్టీఆర్ సినిమాల పై ఉన్నఆస‌క్తితో ఎంతో కష్టపడి స్టార్ హీరోగా ఎదిగారు. ఆయన ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల‌లో నటించి అభిమానులను సంపాదించుకున్నారు. ఇక ఎన్టీఆర్ స్టార్ హీరో గా రానిస్తున్న‌ సమయంలో ఆయన పక్కన జోడిగా నటించేందుకు హీరోయిన్లు వెంటపడేవారు.

Advertisement

అయితే అలాంటి సమయంలో శ్రీదేవి మాత్రం వేటగాడు సినిమాలో ఎన్టీఆర్ కు జోడిగా నటించేందుకు నో చెప్పిందట. శ్రీదేవి అలా ఎందుకు నో చెప్పింది…? ఆ తర్వాత ఎలా కలిసి నటించాల్సి వచ్చింది..? అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం… రాఘవేంద్రరావు దర్శకత్వంలో వేటగాడు సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కథను ఎన్టీఆర్ కు చెప్పిన తర్వాత రాఘవేంద్రరావు హీరోయిన్ వేటలో పడ్డారు. అయితే ఆ సమయంలో ఎన్టీఆర్ హీరోయిన్ గా శ్రీదేవిని తీసుకోవాలని సూచించారట.

Advertisement

 

కానీ వేటగాడు సినిమా నిర్మాతలు సైతం సినిమాలో శ్రీదేవి వద్దని చెప్పారట. దానికి కారణం.. వేటగాడు సినిమా కంటే ఐదేళ్ల క్రితమే బడిపంతులు సినిమాలో ఎన్టీఆర్ కు మనవరాలిగా శ్రీదేవి నటించింది. దాంతో నిర్మాత‌లు ఇప్పుడు ఎన్టీఆర్ పక్కన శ్రీదేవి హీరోయిన్ గా నటిస్తే ప్రేక్షకులు రిసీవ్ చేసుకోరేమో అని చెప్పారట. కానీ ఎన్టీఆర్ మాత్రం వేటగాడు సినిమాలో తన పక్కన శ్రీదేవి నే నటించాలని పట్టుబట్టారట.

ఇక దర్శకుడు రాఘవేంద్రరావు శ్రీదేవిని సంప్రదించగా మొదట ఆమె కూడా నో చెప్పారట. దాంతో ఎన్టీఆర్ నిర్మాతలతో ప్రేక్షకులు మంచి కథ కథనం ఉంటే సినిమాను చూస్తారు… ఆదరిస్తారు. సినిమాల్లో వయసులతో సంబంధం ఉండదు. నటించగలిగితే జోడి స్క్రీన్ పై అందంగా కనిపిస్తే సరిపోతుంది అని చెప్పి ఒప్పించారట. అంతేకాకుండా సినిమాకు తానే ఫ్రీ పబ్లిసిటీ చేస్తానని చెప్పారట. అక్కడితో ఆగకుండా ఎన్టీఆర్ స్వయంగా వెళ్లి శ్రీదేవిని ఈ సినిమాలో నటించాలని చెప్పారట. దాంతో శ్రీదేవి కూడా వేటగాడు సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నారు. అలా పట్టాలెక్కిన ఎన్టీఆర్ శ్రీదేవి కాంబినేషన్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి ఎన్నో సూపర్ హిట్ సినిమాల‌లో నటించారు.

Visitors Are Also Reading