Home » అఖండ ను టచ్ చేయలేకపోయిన గాడ్ ఫాదర్….! చిరు ను బాలయ్య వెనక్కి నెట్టేశాడా….?

అఖండ ను టచ్ చేయలేకపోయిన గాడ్ ఫాదర్….! చిరు ను బాలయ్య వెనక్కి నెట్టేశాడా….?

by AJAY
Ad

సినిమా ఇండస్ట్రీలో హీరోల మధ్య పోటీ కామన్. కుర్ర హీరోల నుండి ఒకప్పటి హీరోల వరకు హీరోల మధ్యన పోటీ చూస్తూనే ఉంటాం. ఇక టాలీవుడ్ లో చిరంజీవి బాలయ్య మధ్య పోటీకి ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఇద్దరూ స్టార్ హీరోలు.. అంతేకాకుండా ఎక్కువమంది ఫ్యాన్ బేస్ ఉన్న హీరోలు. ప్రస్తుతం ఇద్దరూ సీనియర్ హీరోలుగా రాణిస్తున్నారు. ఇక రీసెంట్ గా చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే.

Advertisement

ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. మలయాళ సూపర్ హిట్ చిత్రం లూసిఫర్ గాడ్ ను తెలుగులో గాడ్ ఫాదర్ సినిమా పేరుతో రీమేక్ చేశారు. మోహన్ రాజా ఈ సినిమాకు దర్శకత్వం వహించగా సత్యదేవ్ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటించారు. నయనతార సైతం ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలో కనిపించింది.

Advertisement

పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించగలిగింది. అయితే కలెక్షన్ల పరంగా చూసుకున్నట్లయితే అనుకున్న రేంజ్ లో మాత్రం రాబట్టలేదని సమాచారం. అంతేకాకుండా ఈ సినిమా ఫస్ట్ వీక్ కలెక్షన్ల విషయానికి వ‌స్తే బాలయ్య అఖండ సినిమాను సైతం బీట్ చేయలేకపోయింది. గాడ్ ఫాదర్ సినిమా ఫస్ట్ వీక్ ఏడు రోజులలో ప్రపంచవ్యాప్తంగా 96 కోట్ల గ్రాస్ వ‌సూలు చేయ‌డంతో పాటు 53 కోట్ల షేర్ ను సొంతం చేసుకుంది.

బాలయ్య అఖండ సినిమా విషయానికి వస్తే విడుదలైన తర్వాత 11 రోజుల వరకు ప్రతిరోజు కోటి రూపాయల షేర్ ను వసూలు చేసింది. కానీ గాడ్ ఫాదర్ సినిమా కేవలం 6 రోజులు మాత్రమే కోటి రూపాయల షేర్ ను వసూలు చేస్తూ వచ్చింది. మరోవైపు చిరంజీవి నటించిన ఆచార్య సినిమా అట్టర్ ఫ్లాప్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ముందు ముందు బాలయ్య ల బాక్స్ ఆఫీస్ ఫైట్ ఏవిధంగా ఉంటుందో చూడాలి.

Visitors Are Also Reading