టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వారం వారం సినిమాలు విడుదలవుతూనే ఉన్నాయి. అవి పేరుకు తెలుగు సినిమాలు అయినప్పటికీ అందులో మాత్రం సొంత భాష కనిపించడం లేదు. ఇందులో నటించే వారే సరైన తెలుగును స్పష్టంగా మాట్లాడలేకపోవడం విశేషం. వీరిని అనుసరించి చాలా మంది వారికి వచ్చిన తెలుగును మరిచిపోతున్నారు. క్రమ క్రమంగా తెలుగు భాష అంతరించిపోతుంది. తెలుగు పండితులు, మేధావులు, తెలుగు భాసను కాపాడాలని ఉద్యమాలు చేస్తున్నా ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోవడం లేదు.
ఇవి కూడా చదవండి: సావిత్రి అలా దిగజారిపోకూడదు కదా అంటూ సీనియర్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు..వీడియో వైరల్….!
Advertisement
అప్పుడప్పుడు తెలుగు మహాసభలు నిర్వహించి ఇది చేస్తాం.. అది చేస్తామని తెలుగు భాషాభివృద్ధికి ప్రయత్నించడమే లేదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్ ఎన్వీ రమణ పేర్కొనడం గమనార్హం. ప్రధానంగా తెలుగు సినిమా హీరోలు తెలుగు భాషను నేర్చుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ తెలుగు గాయకుడు ఘంటసాల శతజయంతి కార్యక్రమానికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్ ఎన్వీ రమణ హాజరై మాట్లాడారు. తెలుగు భాష గురించి చెప్పాడు. సినీ నటులు తెలుగు భాషను ఉపయోగిస్తే బాగుంటుంది. అప్పట్లో ఎన్టీర్, ఏఎన్నార్ తెలుగు రాకపోయినా.. డ్యాన్స్ రాకపోయినా ప్రత్యేకంగా శిక్షణ పొందారు. తెలుగు రాకపోతే అవమానకరంగా భావించవద్దు.. ప్రతి తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు ఇంట్లో తెలుగు నేర్పించాలని సూచించారు.
Advertisement
ఇవి కూడా చదవండి: ప్రస్తుతం స్టార్ హీరోయిన్లుగా రాణిస్తున్న ఈ ముద్దుగుమ్మలు ఫస్ట్ సినిమాలో ఎంత అందంగా ఉన్నారో చూశారా..?
ప్రస్తుతం వస్తున్న సినిమాల్లో చాలా వాటిలో సరైన తెలుగు అసలు కనిపించడం లేదు. ఇంగ్లీషు, హిందీ భాషలను కలిపి స్పష్టమైన తెలుగు భాషకు తెగులు పుట్టేలా వాడుతున్నారు. కేవలం కొందరు గాయకులు అచ్చమైన తెలుగు పదాలు వాడుతున్నప్పటికీ కొందరూ మాత్రం వారి పాటల్లో తెలుగు కనిపించడం లేదు. తెలుగు పాటలు పాడాలని చాలా మంది పండితులు కోరుతున్నారు. ముఖ్యంగా పాఠశాలల్లో, కళాశాలల్లో ఎక్కువగా ఆంగ్లానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తమ ప్రాంతీయ భాషను తప్పనిసరిగా చేయాలని ప్రకటించినా అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమిళనాడు ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలకు తమిళ భాష తప్పనిసరి చేసింది. భాషాభిమానం ఎక్కువగా ఉన్న తమిళనాడులో ఇలాంటి నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లో తెలుగు భాషను తప్పనిసరి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని నిరుద్యోగులు సైతం కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి: ప్రాపర్టీని అమ్మేసిన చిరంజీవి.. ఎన్ని కోట్లకు డీల్ కుదుర్చుకున్నారంటే..?