Home » సావిత్రి అలా దిగజారిపోకూడదు కదా అంటూ సీనియర్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు..వీడియో వైరల్….!

సావిత్రి అలా దిగజారిపోకూడదు కదా అంటూ సీనియర్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు..వీడియో వైరల్….!

by AJAY
Ad

తెలుగు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో ఒక‌ప్పుడు ఓ వెలుగు వెలిగిన అందాల తార‌ల్లో కృష్ణ కుమారి కూడా ఒక‌రు. ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాల్లో న‌టించి కృష్ణ కుమారి ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు. అప్ప‌టి స్టార్ హీరోలు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తో పాటూ శివాజి గ‌ణేష‌న్, ఎంజీఆర్ ల స‌ర‌స‌న కూడా కృష్ణ కుమారి న‌టించి మెప్పించారు. న‌వ‌రత్నాలు సినిమాతో కృష్ణ కుమారి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు.

Advertisement

అప్పుడు కృష్ణ కుమారి వ‌య‌సు కేవ‌లం 16 సంవ‌త్స‌రాలే కావ‌డం విశేషం. న‌వ‌ర‌త్నాలు సినిమా విడుద‌ల కాక‌ముందే కృష్ణ కుమారి 16 సినిమాల్లో న‌టించే ఛాన్స్ కొట్టేశారు అంటే ఆమె అందం ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌ను ఎలా క‌ట్టిప‌డేసిందో అర్థం చేసుకోవ‌చ్చు. ఆఫ‌ర్ లు వ‌చ్చిన‌ప్ప‌టికీ వ‌రుస ఫ్లాపులు ప‌డ‌టంతో కృష్ణ కుమారి ఫ్లాప్ ల హీరోయిన్ అంటూ నింద‌లు వేయ‌డం మొద‌ల‌య్యింది.

Advertisement

కానీ ఆ త‌ర‌వాత మ‌ళ్లీ సూప‌ర్ హిట్ ల‌ను అందుకుని ఇండ‌స్ట్రీలో రానించింది. ఇదిలా ఉండ‌గా కృష్ణ కుమారి ఓ ఇంట‌ర్వ్యూలో మ‌హాన‌టి సావిత్రి గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. సావిత్రి ఓ పెద్ద స్టార్ హీరోయిన్..ఆమెకు అలా జ‌ర‌గ‌టంతో నాకు కోపం వ‌చ్చింది. ఆమె ఇంటిలిజెన్స్ ఏమ‌య్యింది. ప‌ర్స‌న‌ల్ లైఫ్ లో ఇబ్బందులు ఉన్నాయని అలా దిగ‌జారిపోకూడ‌దు క‌దా.

అందుకే ఆమె చ‌నిపోయిన‌ప్పుడు వెళ్ల‌లేదు అంటూ కృష్ణ కుమారి కామెంట్స్ చేశారు. ఇప్పుడు కృష్ణ కుమారి చేసిన కామెంట్లు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. దాంతో మ‌హాన‌టి ఫ్యాన్స్ మండి ప‌డుతున్నారు. సావిత్రి చుట్టూ ఉన్న‌వాళ్లు మోసం చేయ‌డంతోనే అలా చేసుకుంది. న‌మ్మిన వాళ్లు మోసం చేస్తే ఆ భాధ‌ను బ‌రించ‌లేం కాబ‌ట్టి అలా చేసుకుందేమో…కానీ చ‌నిపోయిన‌ప్పుడు వెళ్ల‌కుండా అలాంటి కార‌ణాలు చెబుతారేంట‌ని మండిప‌డుతున్నారు.

ఇది కూడా చదవండి : బాలయ్య బాబు ఖర్చులు చూసి ఆశ్చర్యపోయిన అన్నగారు.. ఏమన్నారో తెలిస్తే షాక్ అవుతారు..!

Visitors Are Also Reading