Home » JR:NTR చేయాల్సిన ఖైదీ నెంబర్ 150.. చిరు చేయడం వెనుక ఇంత కథ ఉందా..?

JR:NTR చేయాల్సిన ఖైదీ నెంబర్ 150.. చిరు చేయడం వెనుక ఇంత కథ ఉందా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి అంటే ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. దాదాపుగా నాలుగు దశాబ్దాల పాటు నిర్విరామంగా ఇండస్ట్రియన్ ఏలాడు.. అలాంటి చిరంజీవి తర్వాత తొమ్మిది సంవత్సరాలు గ్యాప్ ఇచ్చి రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు.. ఆ తర్వాత ఖైదీ నెంబర్ 150 ద్వారా రీ ఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్.. అయితే ఈ మూవీ తమిళ “కత్తి” సినిమాకు రీమేక్. దాదాపుగా 100 కోట్లకు పైగా షేర్ కాబట్టి ఈ మూవీ ఘన విజయం సాధించింది.

Advertisement

also read;వీరసింహా రెడ్డి లో నటించిన వరలక్ష్మి కి ఎన్ని కోట్లు ఇచ్చారో తెలుసా ? హీరో కంటే ఎక్కువా..?

Advertisement

అలాంటి ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటించాల్సి ఉందని దర్శకుడు గోపీచంద్ ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. తాను ఎన్టీఆర్ తో ఒక సినిమా చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్నానని అన్నారు. కోలీవుడ్ మూవీ కత్తిని తెలుగులో ఎన్టీఆర్ హీరోగా రీమేక్ చేయాలనుకున్నానని గోపీచంద్ తెలియజేశారు. ఈ సినిమా పట్ల ఎన్టీఆర్ కూడా ఆసక్తి చూపించారని అన్నారు. అయితే విజయ్ కత్తిని మొదట తెలుగులో డబ్ చేయాలనుకోవడం, ఇందులో చిరంజీవి చేయలనుకోవడం వంటి కారణాలవల్ల ఈ ప్రాజెక్టు ఆగిపోయిందని చెప్పుకొచ్చారు.

అంతేకాదు ఈ రీమెక్ మూవీ మిస్ అయ్యాక దిల్ రాజ్ నిర్మాణ సారథ్యంలో మూవీ చేయడం కొరకు ఎన్టీఆర్ కి ఒక కథ వినిపించానని అన్నారు. దీంతో ఎన్టీఆర్ వైలెన్స్ ఎక్కువైందని తెలియజేశారు.అంతేకాకుండా 2016-17 సమయంలో ఎన్టీఆర్ మలినేని గోపీచంద్ కాంబోలో రావలసిన మరో ప్రాజెక్టు కూడా ఆగిపోయిందని అన్నారు. మరి చూడాలి భవిష్యత్తులో వీరి కాంబోలో ఏదైనా సినిమా వస్తుందా లేదా అనేది.

also read;

Visitors Are Also Reading