Home » నిరుద్యోగులకు శుభవార్త… రాతపరీక్ష లేకుండా BHELలో ఉద్యోగాలు…

నిరుద్యోగులకు శుభవార్త… రాతపరీక్ష లేకుండా BHELలో ఉద్యోగాలు…

by Bunty
Ad

 

నిరుద్యోగులకు శుభవార్త.. భారత ప్రభుత్వ భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన బెంగళూరులోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, 10 ప్రాజెక్టు సూపర్వైజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో కనీసం 60 శాతం మార్పులతో బిఈ/బిటెక్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులు ఉత్తీర్ణత సాధించిన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే సంబందిత పనిలో ఏడాది అనుభవం కూడా ఉండాలి.

 

Advertisement

అభ్యర్థుల వయసు 32 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆన్లైన్ విధానంలో ఏప్రిల్ 29, 2022వ తేదీ రాత్రి 8 గంటల లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 10వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. అనంతరం నింపిన దరఖాస్తులను డౌన్లోడ్ చేసుకొని కింది అడ్రస్ కు మే 6వ తేదీలోపు పోస్ట్ ద్వారా పంపించవలసి ఉంటుంది.

Advertisement

BHEL Recruitments in India - Latest BHEL Jobs 2023, BHEL Vacancy in India

దరఖాస్తు సమయంలో జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబిసి అభ్యర్థులు రూ.200 అప్లికేషన్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పిడబ్ల్యుడి/ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక వర్తిస్తుంది. ఎంపికైన వారికి నెలకు రూ.43,550 వరకు జీతం గా చెల్లిస్తారు. జీతంతో పాటు ఇతర అలవెన్స్ లు కూడా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్ లో చెక్ చేసుకోవచ్చు.

read also : పెళ్లికి ముందే ప్రియుడుతో కలిసి తిరుమలలో దర్శనం ఇచ్చిన జాన్వి

Visitors Are Also Reading