Home » డైరెక్షన్ రాకపోయినా “శేషు” సినిమాకు జీవిత ఎందుకు దర్శకత్వం వహించిందో తెలుసా…!

డైరెక్షన్ రాకపోయినా “శేషు” సినిమాకు జీవిత ఎందుకు దర్శకత్వం వహించిందో తెలుసా…!

by AJAY
Published: Last Updated on
Ad

జీవితా రాజశేఖర్ ఈ రెండు పేర్లు భార్యాభర్తలవి అయినా వీరిద్దరినీ వేరు చేసి చూడలేము. రాజశేఖర్ ఎక్కడ ఉంటే జీవిత అక్కడ కనిపిస్తుంది. నిజానికి రాజశేఖర్ హీరోగా సక్సెస్ అయ్యారు అంటే అది జీవిత వల్లే అని చాలా మంది భావిస్తుంటారు. దానికి కారణం రాజశేఖర్ కోప దాటి మనిషి… ఏ చిన్న తప్పు అయినా సహించలేరు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు.

Advertisement

కాబట్టి జీవిత రాజశేఖర్ ను ఎలాంటి సమయంలో అయినా కంట్రోల్ చేస్తూ ఉంటారు. వీరిద్దరిదీ అన్యోన్యమైన అనుబంధం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ప్రస్తుతం వీరిద్దరి కుమార్తెలు శివాత్మిక రాజశేఖర్, శివాని రాజశేఖర్ హీరోయిన్లుగా బిజీగా ఉన్నారు. ఇక రాజశేఖర్ కూడా ప్రస్తుతం సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజాగా రాజశేఖర్ హీరోగా నటించిన సినిమా “శేఖర్”. ఈ సినిమాకు జీవిత దర్శకత్వం వహించారు. జీవిత ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఉన్నారన్న సంగతి చాలామందికి తెలుసు. కానీ ఆమె దర్శకత్వం వహించిన సంగతి మాత్రం చాలామందికి తెలియదు. జీవిత రాజశేఖర్ హీరోగా నటించిన శేషు సినిమాకు మొదటిసారి దర్శకత్వం వహించారు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే ఈ సినిమాకు తాను దర్శకత్వం వహించడానికి కొన్ని కారణాలు ఉన్నాయని జీవిత తాజాగా శేఖర్ సినిమా ప్రమోషన్స్ లో తెలిపారు.

తమిళ్ లో సూపర్ హిట్ అయిన ట్రూ లవ్ స్టోరీ “శేషు” సినిమా రైట్స్ కొన్నామని…. అప్పుడు ఉన్నది ఉన్నట్టుగా తీయాలని చెప్తే ఏ దర్శకుడు ముందుకు రాలేదని చెప్పారు. రాజశేఖర్ కోసం కథలో కొన్ని మార్పులు చేయాలని చెప్పారని…. దాంతో ఆ సినిమాకు తానే దర్శకత్వం వహించానని చెప్పారు. దర్శకురాలిగా తనకు ఎలాంటి అనుభవం లేదని కానీ డిఓపి హరి సపోర్టుతో తన భుజాలపై వేసుకొని శేషు సినిమాకు దర్శకత్వం వహించా అని చెప్పారు.

ALSO READ:

హీరో సుమన్ పెళ్ళిలో చిరంజీవి సందడి…..వైరల్ అవుతున్న ఫోటోలు…!

Visitors Are Also Reading