Home » హీరో సుమన్ పెళ్ళిలో చిరంజీవి సందడి…..వైరల్ అవుతున్న ఫోటోలు…!

హీరో సుమన్ పెళ్ళిలో చిరంజీవి సందడి…..వైరల్ అవుతున్న ఫోటోలు…!

by AJAY
Published: Last Updated on
Ad

టాలీవుడ్ లో ఒకప్పటి అందగాడిగా గుర్తింపు తెచ్చుకున్న హీరో సుమన్. కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించిన సుమన్ మెల్లిమెల్లిగా సినిమాల వైపు అడుగులు వేశారు. సుమన్ నేర్చుకున్న కరాటే వల్లనే సినిమా అవకాశాలు కూడా వచ్చినట్లు చెబుతారు. ఇక సుమన్ మొదట తమిళ్ లో సినిమాలు చేసి ఆ తర్వాత టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. తమిళ్ కంటే ఇక్కడే ఆయన కు ఎక్కువ మంది అభిమానులు అయ్యారు.

hero-suman-marriage

hero-suman-marriage

హీరోగా సక్సెస్ అయిన సుమన్ అమ్మాయిల ఫేవరెట్ గా మారిపోయారు. వరుస సినిమాలు చేస్తూ సుమన్ బిజీగా ఉండేవారు. కానీ కొన్ని కేసుల వల్ల సుమన్ జైలు పాలు కావాల్సి వచ్చింది. నీలి చిత్రాల కేసులో సుమన్ ను పోలీసులు అర్థరాత్రి ఇంటికి వెళ్ళి మరీ అరెస్ట్ చేశారు. ఎలాంటి ఆధారాలు కూడా లేకుండా నే సుమన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. దాంతో ఆయన చాలా కాలం పాటు జైలు జీవితం గడిపారు.

Advertisement

Hero Suman Marriage Photos

 హీరో సుమన్ పెళ్లి ఫోటోలు

హీరో సుమన్ పెళ్లి ఫోటోలు

 

Advertisement

జైలు కు వెళ్ళడం వల్లనే సుమన్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదలేకపోయారు. అయితే తన జైలు జీవితం గురించి సుమన్ ఓ ఇంటర్వ్యూ లో చెప్పారు. కానీ ఎవరన్నది మాత్రం సుమన్ బయటపెట్టలేదు. కాకపోతే తమిళనాడులో ఒకప్పటి స్టార్ హీరోయిన్…. ప్రముఖ రాజకీయ నాయకురాలు సుమన్ ను ఈ కేసులో ఇరికించారని చెప్పుకుంటారు.

ఇవి కూడా చదవండి :
హీరో సుమన్ నిజంగే 117 ఎకరాలు ఆర్మీ కి ఉచితంగా ఇచ్చారా ? ఇందులో ఉన్న నిజం ఇదే !

 హీరో సుమన్ పెళ్లి ఫోటోలు

హీరో సుమన్ పెళ్లి ఫోటోలు

అయితే సుమన్ టాలీవుడ్ లో హీరోగా ఎదుగుతున్న సమయంలో ఓర్వలేకనే మెగాస్టార్ చిరంజీవి ఆయన్ను కేసులో ఇరికించారని అప్పట్లో ప్రచారం కూడా ఉండేది. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని సుమన్ ఓ ఇంటర్వ్యూ లో కొట్టిపారేశారు. అంతేకాకుండా చిరంజీవి చాలా మంచి మిత్రుడు అని చెప్పారు. ఇదిలా ఉంటే సుమన్ పెళ్ళికి చిరంజీవి సైతం హాజరయ్యారు. ప్రస్తుతం చిరంజీవి సుమన్ పెళ్లిలో సందడి చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ALSO READ : రాజీవ్ గాంధీ హత్యకు మురారి సినిమాకు ఉన్న సంబంధం ఏంటో తెలుసా…!

 

Visitors Are Also Reading