Home » మోహ‌న్‌బాబు హిట్ సినిమాను జ‌య‌సుధ ఎందుకు రిజెక్ట్ చేసిందో తెలుసా..?

మోహ‌న్‌బాబు హిట్ సినిమాను జ‌య‌సుధ ఎందుకు రిజెక్ట్ చేసిందో తెలుసా..?

by Anji
Ad

క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబు, స‌హ‌జ న‌టి జ‌య‌సుధ‌ల‌ది మంచి హిట్ కాంబినేష‌న్‌. వీరిద్ద‌రూ క‌లిసి న‌టించిన శివ‌రంజిని ఏడు అడుగుల బంధం, క‌ల్యాణ తిల‌కం, రాయ‌ల‌సీమ రామ‌న్న‌చౌద‌రి త‌దిత‌ర చిత్రాల‌తో హిట్ ఫెయిర్ అనిపించుకున్నారు.

అయితే మోహ‌న్‌బాబు న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం పెద‌రాయుడు సినిమాలో భానుప్రియ పాత్ర‌కు తొలుత జ‌య‌సుధ‌ను అనుకున్నార‌ట‌.

Advertisement

కానీ ఆ సినిమాలో డ్యూయెట్ ఉండ‌డంతో చేయ‌ను అని చెప్పార‌ట జ‌య‌సుధ‌. దీంతో స్థానంలో భానుప్రియ‌ను తీసుకున్నారు. మ‌రొక హీరోయిన్‌గా సౌంద‌ర్యను తీసుకున్నారు. మోహ‌న్‌బాబు డ్యూయ‌ల్ రోల్ చేసిన ఈ చిత్రంలో రజినికాంత్ కీల‌క పాత్ర పోషించారు.

Advertisement

ఈ సినిమా త‌రువాత మోహ‌న్‌బాబు రేంజ్ ఎక్క‌డికో వెళ్లిపోయింది. ఆయ‌న‌కు ఈ చిత్రంతోనే క‌లెక్ష‌న్‌కింగ్ అనే బిరుదు రావ‌డం విశేషం. త‌మిళంలో హిట్ అయిన నాట్ట‌మై అనే చిత్రానికి ఇది రీమెక్. అయితే మోహ‌న్‌బాబుతో ఈ చిత్రానికి సంబంధించిన రీమెక్ హ‌క్కులు కొనిపించి పైసా పారితోషికం తీసుకోకుండా ర‌జినికాంత్ పెద‌రాయుడు చిత్రంలో న‌టించ‌డం మ‌రొక విశేషం.

Also Read : ఎన్టీఆర్ స‌మీరారెడ్డి మ‌ధ్య సంబంధం ఏంటి..? ఆ రూమ‌ర్లు ఎందుకు వ‌చ్చాయి…!

Visitors Are Also Reading