Home » “కేవలం వారే కారణం అంటూ కాస్టింగ్ కౌచ్ ” గురించి మొదటిసారిగా స్పందించిన సీనియర్ హీరోయిన్ జయప్రద..!

“కేవలం వారే కారణం అంటూ కాస్టింగ్ కౌచ్ ” గురించి మొదటిసారిగా స్పందించిన సీనియర్ హీరోయిన్ జయప్రద..!

by Mounika

తెలుగు చిత్ర పరిశ్రమలోని అత్యంత ప్రసిద్ధ సీనియర్ నటీమణులలో జయప్రద కూడా ఒకరు. టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలందరి సరసన ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్నారు జయప్రద. ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన జయప్రద ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ రాజకీయాల్లో చాలా బిజీ ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో జయప్రద పాల్గొని క్యాస్టింగ్ కౌచ్, హీరోయిన్ల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా జయప్రద మాట్లాడుతూ ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో కాస్టింగ్ కౌచ్ ఒకటి. అయితే మేము కథానాయికలుగా ఉన్నప్పుడు ఈ పేరు చాలా అరుదుగా వినిపించేది. ఇప్పుడు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. చిన్న స్థాయి మట్టి దగ్గర నుంచి అగ్రస్థాయి హీరోయిన్ల వరకు ఎక్కువగా కాస్టింగ్ కౌచ్ గురించి, తాము ఎదుర్కొన్న పరిస్థితుల గురించి బహిరంగంగా చెప్పుకొస్తున్నారు . మేము హీరోయిన్లుగా ఉన్నప్పుడు ఇలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు.

ఈరోజుల్లో అందరూ ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నామని ముక్తకంఠంతో చెబుతున్నారు. ఇలా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ కి కారణం హీరోయిన్లే అని ఆమె ఆరోపించారు. అవకాశాలు రావాలి అంటే ప్రతిభ ఉండాలి. టాలెంట్ ఉంటే తప్పకుండా సినిమా అవకాశాలు వస్తాయని జయప్రద చెప్పుకొచ్చారు. అయితే ఈరోజుల్లో ముంబై నుంచి అందరు హీరోయిన్లుగా ఇండస్ట్రీలోకి వస్తున్నారు. ఇలాంటివారు అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే దర్శక నిర్మాతలకు, హీరోలకు వారే కమిట్మెంట్లు ఇస్తూ వారు చెప్పినట్లు పక్కలోకి వెళ్తున్నారు అంటూ జయప్రద ఆరోపించారు. జయప్రద ఇంటర్వ్యూలో చెప్పిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

రఘువరన్ ఇలా చనిపోయారు.. ఆయన సోదరుడు సెన్సేషనల్ కామెంట్స్..!

రంగస్థలం మూవీలో రామ్ చరణ్ చెల్లెలుగా నటించిన చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

పుట్టినరోజు సందర్భంగా మహేష్ బాబుకి అరుదైన గౌరవం.. ఆ ఘనత సాధించిన తొలి హీరో ఇయనే..! 

Visitors Are Also Reading