నటి జయలలిత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. చిన్న వయసు నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన జయలలిత ఇప్పటికి కూడా సినిమాలలో నటించి మంచి సక్సెస్ను తన ఖాతాలో వేసుకుంటుంది. ఇక ఒకానొక సమయంలో తన కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో ఓ డైరెక్టర్ ను ప్రేమించి వివాహం చేసుకుంది. ఇంట్లో కుటుంబ సభ్యులను ఎదిరించి మరీ అతన్ని వివాహం చేసుకుంది. కానీ వివాహ అనంతరం అతని నిజ స్వరూపం బయటపడింది.
కేవలం ఆస్తి కోసమే తనపై ప్రేమను చూపించాడని అర్థం చేసుకున్న జయలలిత తనతో హింస భరించలేక విడాకులు తీసుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన వ్యక్తిగత జీవితంలో జరిగిన విషయాలను షేర్ చేసుకుంది. నేను ఒక క్లాసికల్ డాన్సర్ ని. పదవ తరగతి ఫెయిల్ అయ్యాను. చాలా సినిమాలు నాకు చేతి దాకా వచ్చి చేజారిపోయాయి. ఆ తర్వాత ఎక్కువగా ఐటమ్ సాంగ్స్ ఆఫర్ వచ్చాయి. అయినా కూడా చేశాను. నా కుటుంబం నా మీద ఆధారపడి ఉండడంతో పొట్టి పొట్టి బట్టలు కూడా వేసుకొని నటించాను. నా పేరు జయలలిత అని పెట్టుకోవడం వల్ల తమిళనాడులో నాకు పెద్ద సమస్య ఎదురయింది. మంచి పేరు పెట్టుకుని కమెడియన్ గా, ఐటమ్ సాంగ్స్ చేస్తున్నావు అని నా ఇంటిపై దాడి చేశారు. పేరు మార్చుకోండని బెదిరించారు. నేను ఒప్పుకోకపోవడంతో అక్కడ నాకు సినిమా అవకాశాలు రాలేదు.
Advertisement
Advertisement
నేను మలయాళ డైరెక్టర్ వినోద్ ను ప్రేమించి వివాహం చేసుకున్నాను. నా విషయంలో ఒక గొడవ జరిగితే అతను ముందుండి ఆ సమస్యను పరిష్కరించాడు. అంత చిన్నదానికే నేను ప్రేమలో పడిపోయాను. అతని కోసం చాలా సినిమాలు వదులుకున్నాను. ఇక కుటుంబ సభ్యులను ఎదిరించి వివాహం చేసుకున్నాను. పెళ్లి అయిన మరుసటి రోజు నుంచే నా ఆస్తి కోసం నన్ను హింస పెట్టడం ప్రారంభించాడు. కేవలం 6 నెలలకి అతని నుంచి నేను విడాకులు తీసుకున్నాను. నా నగలు, డబ్బు అంత ఇచ్చినా కూడా నన్ను చాలా టార్చర్ పెట్టారు. ఈ మధ్యకాలంలో కూడా నేను సంపాదించిన దాంతో నాలుగు కోట్ల రూపాయలను పోగొట్టుకున్నాను. నా కార్ డ్రైవర్ ఇబ్బందుల్లో ఉన్నానని అమ్మ అమ్మ అని అడగడంతో డబ్బులు ఇచ్చాను. అతను నాకు డబ్బులు ఇవ్వకుండా మోసం చేసి వెళ్ళిపోయాడు.
ఇవి కూడా చదవండి
- Andrew Flintoff : అయ్యో పాపం…ఫ్లింటాఫ్ ఏంటి ఇలా అయిపోయాడు…!
- Mark Antony Review : మార్క్ ఆంటోని రివ్యూ..విశాల్ హిట్టు కొట్టాడా ?
- ప్రాణం పోయినా ఈ 9 విషయాలు ఎవరికీ చెప్పకూడదు…!