Home »  జవాన్, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి రెండు సినిమాల్లో ఏ సినిమా బాగుందంటే..? 

 జవాన్, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి రెండు సినిమాల్లో ఏ సినిమా బాగుందంటే..? 

by Anji
Ad

సాధారణంగా ప్రతీ శుక్రవారం సినిమాలు విడుదలవుతుంటాయి. ఇవాళ గురువారం అయినప్పటికీ శ్రీకృష్ణాష్టమి పర్వదినం కావడంతో రెండు సినిమాలు విడుదలయ్యాయి. బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ నటించిన జవాన్, టాలీవుడ్ నటి అనుష్క నటించిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాలు విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలతో విడుదలయ్యాయి. జవాన్ మూవీకి అట్లీ దర్శకత్వం వహించగా.. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీకి డైరెక్టర్ మహేష్ బాబు దర్శకత్వం వహించారు.  ఈ రెండు సినిమాల్లో చాలా ప్రత్యేకతలున్నాయని సమాచారం. ఈ రెండు సినిమాలు పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడం గమనార్హం. 

Advertisement

జవాన్ మూవీ తో షారుఖ్ ఖాన్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ చేరింది. ఈ చిత్రంలో స్క్రీన్ ప్లే, యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయినట్టు తెలుస్తోంది. అదేవిధంగా ఎమోషనల్ సీన్స్ సైతం ప్రేక్షకులను ఆకట్టుకునేవిధంగా ఉన్నాయి. విజయ్ సేతుపతి, నయనతార అద్భుతమైన నటనతో ఈ మూవీ సక్సెస్ విషయంలో కీలక పాత్ర పోషించారు. షారుఖ్ ఖాన్ అభిమానులకు ఫుల్ మీల్స్ లా ఉంది. ఓ వర్గం ప్రేక్షకులు మాత్రమే జవాన్ మూవీని యావరేజ్ మూవీగా ఫీల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.  జవాన్ కలెక్షన్లు బాక్సాఫీస్ వద్ద ఊహించని రేంజ్ లో ఉండనున్నాయి. మరోవైపు మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీ కూడా ప్రేక్షకులను మెప్పించే విధంగానే ఉండటం విశేషం. 

Advertisement

ఈ చిత్రంలో నవీన్ పొలిశెట్టి కామెడీ టైమింగ్ అదుర్స్ అనే చెప్పాలి. అనుష్క ఈజ్ బ్యాక్ అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. క్లాస్ ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకునే విధంగా ఈ చిత్రం ఉండనుందని సమాచారం. క్లీన్ కామెడీ మూవీగా తెరకెక్కించిన ఈ చిత్రం ఏ సెంటర్ ప్రేక్షకులను ఆకట్టుకునేవిధంగా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫస్టాప్ అద్భుతంగానే ఉండగా.. సెకండాఫ్ బాగానే ఉంది. ఈ వీకెండ్ కి యాక్షన్ మూవీ చూడాలనుకునే ప్రేక్షకులకు జవాన్ మంచి ఆప్షన్ కాగా.. క్లాస్ మూవీ చూడాలనే ప్రేక్షకులకు మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఆప్షన్ గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రెండు సినిమాల్లో కూడా చిన్న చిన్న మైనస్ లు తప్ప పెద్దగా చెప్పుకోదగిన మైనస్ లు ఏమి లేవు. ఈ వారం రెండు సినిమాలు కూడా సూపర్ హిట్ సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. జవాన్ యాక్షన్ కేరాఫ్ అయితే..  మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి  కామెడీకి ఫేమస్. అభిమానులు ఈ రెండు సినిమాలను వీక్షించే అవకాశం ఉంది. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

పవన్ కళ్యాణ్ కాలేజీలో ఉండగానే ప్రేమలో పడ్డాడా..? ఆయన ప్రియురాలు ఎవరో తెలుసా ?

 మెగాస్టార్ తో అక్కినేని అమల నటించిన మూవీ ఏదో తెలుసా ?

Visitors Are Also Reading