Home » మెగాస్టార్ తో అక్కినేని అమల నటించిన మూవీ ఏదో తెలుసా ?

మెగాస్టార్ తో అక్కినేని అమల నటించిన మూవీ ఏదో తెలుసా ?

by Anji
Ad

మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. సినీ ఇండస్ట్రీలో చాలా మంది నటీనటులకు స్ఫూర్తిగా నిలుస్తుంది. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చిరంజీవి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. దాదాపు 150కి పైగా సినిమాల్లో డ్యాన్స్, యాక్టింగ్, ఎమోషనల్, కామెడీతో ప్రేక్షకులను అలరించారు. ఆయన సినీ ప్రస్థానంలో వన్ ఆఫ్ ది హిట్ మూవీ రాజా విక్రమార్క. రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చిరు సరసన అక్కినేని అమల కథానాయికగా అలరించారు.

Advertisement

వీరిద్దరూ కలిసి నటించిన ఏకైక చిత్రం ఇదే కావడం విశేషం. ఈ సినిమాను స్కంధ ఆర్ట్స్ బ్యానర్ పై అమర్నాథ్ రెడ్డి నిర్మించగా 1989 ఆగస్టు 07న బెంగళూరులో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయింది. ఆ సమయంలో అక్కడే రజినీకాంత్, రవిచంద్రన్ హీరోలుగా నటిస్తోన్న శాంతి క్రాంతి సినిమా షూటింగ్ కూడా జరుగుతుంది. ఒకే రోజు ఇటు చిరంజీవి..అమల మూవీ స్టార్ట్ కావడంతో అక్కడే ఉన్న తలైవా ముఖ్య అతిథిగా వచ్చి చిరంజీవి.. రాధిక, అమల మధ్య వచ్చే సీన్ పై క్లాప్ కొట్టారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Advertisement

రాజా విక్రమార్క మూవీ సమయంలో చిరంజీవి ఓ హిందీ మూవీ చేయాల్సి ఉంది. దీంతో పాటు రాజా విక్రమార్క అటు హిందీ మూవీ ఎలా చేయాలని తర్జనభర్జన పడ్డారట చిరంజీవి. అదే సమయంలో డైరెక్టర్ సలహా తీసుకొని రాజా విక్రమార్క సినిమా కాకుండా హిందీలో ప్రతిబంధ్ మూవీ చేశారు. ఈ మూవీతోనే చిరంజీవి హిరోగా.. అల్లు అరవింద్ నిర్మాతగా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

మెగా హీరోలకు ప్లాప్ లు ఇచ్చి.. నందమూరి హీరోలకు హిట్‌లు ఇచ్చిన దర్శకులు?

Visitors Are Also Reading