Home » మ్యాచ్ జరుగుతుండగా గ్రౌండ్ లోనే మకాం వేశాడు..ఎవరు ఇతను ?

మ్యాచ్ జరుగుతుండగా గ్రౌండ్ లోనే మకాం వేశాడు..ఎవరు ఇతను ?

by Bunty
Ad

2021 సంవత్సరంలో ఇంగ్లాండ్ మరియు టీమిండియా జట్ల మధ్య టెస్టు సిరీస్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఇంగ్లాండ్ తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకున్న సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. మ్యాచ్ లంచ్ విరామం తర్వాత టీమిండియా ప్లేయర్లు మైదానంలోకి అడుగుపెడుతున్న సమయంలో జార్వో అనే వ్యక్తి… టీమిండియా ఆటగాళ్లతో కలిసి గ్రౌండ్లోకి వెళ్లి… నాన హంగామా చేశాడు.

Jarvo invaded the pitch on two separate occasions in the Test series between England and India

Jarvo invaded the pitch on two separate occasions in the Test series between England and India

అయితే మొదట జార్వో ని గుర్తుపట్ట లేకపోయిన సిబ్బంది… ఆ తర్వాత అతన్ని బయటికి తీసుకువెళ్లారు. జార్వో ఇలా ఇతర మ్యాచ్లలోనూ చేశాడట. అయితే అసలు ఈ జార్వా ఎవరు ? ఎందుకు ఇలా చేశాడు ? అతని బ్యాగ్రౌండ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. జార్వో… పూర్తి పేరు డానియల్ జార్వోస్. ఇతనికి ట్విట్టర్ అకౌంట్ తో పాటు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఇతను ప్రముఖ కమెడియన్, ఫిలిం మేకర్ కూడా.

Advertisement

Advertisement

అంతేకాదండోయ్ ఫ్రాంక్ మాస్టర్ కూడా. ఎప్పుడూ ఏదో ఒకటి చేసి… నిత్యం సోషల్ మీడియాలో నిలుస్తూ ఉంటాడు. జార్వో ట్విట్టర్ అకౌంట్ కు ఏకంగా 8వేల ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే యూట్యూబ్లో రెండు మిలియన్స్ సబ్స్క్రయిబర్లు కూడా ఉన్నారు. జార్వో ఇంగ్లాండ్ దేశానికి చెందినవాడు. ఇతనికి పెళ్లి అయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారట. జార్వోకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. అందుకే ప్రతి మ్యాచ్ జరిగిన క్రికెట్ స్టేడియానికి వచ్చి నానా రచ్చ చేస్తాడట.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading