తెలంగాణ రాష్ట్ర రాజకీయలు చాలా రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలోనే..అన్ని పార్టీలు గ్రామ స్థాయిలో పని చేస్తున్నాయి. అటు ఇప్పటికే కమ్యూనిస్టులతో కేసీఆర్ సన్నిహితంగా ఉన్నారు. ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కీలక వాక్యాలు చేశారు. తమ పార్టీ నేత రాహుల్ పై అనర్హత వేటును ఖండిస్తూ ప్రతిపక్షాలు ఏకమయ్యాయి. ఇదే అంశంపైన మాట్లాడిన జానారెడ్డి బి.ఆర్.ఎస్ పొత్తుపై సానుకూలంగా స్పందించారు.
READ ALSO : TS Constable : ఏప్రిల్ 2న పోలీస్ కానిస్టేబుల్ తుది రాతపరీక్ష..కచ్చితంగా ఈ రూల్స్ పాటించండి
Advertisement
బిఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ పొత్తు అనేది, ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు నిర్ణయిస్తారని వాక్యానించారు. బీజేపీపై పోరుకు ఎన్నికలకు సంబంధం లేదన్నారు. బీఆర్ఎస్ లక్ష్యంగా రేవంత్ టీం పోరాటం చేస్తున్న సమయంలో ఇప్పుడు జానారెడ్డి చేసిన వ్యాఖ్యాలతో తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం మొదలైంది. రానున్న ఎన్నికల్లో బిఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పొత్తుకు సంబంధించి కొంతకాలంగా చర్చ సాగుతోంది. వరంగల్ లో జరిగిన బహిరంగ సభలో రాహుల్ పొత్తులకు సంబంధించి క్లారిటీ ఇచ్చారు. బీఆర్ఎస్ తో పొత్తు ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
Advertisement
READ ALSO : ఆ హీరోయిన్ తో నాగ చైతన్య రిలేషన్…ఇలా అడ్డంగా దొరికిపోయారుగా!
టిపిసిసి చీఫ్ రేవంత్ సైతం బీఆర్ఎస్ తో పోరాటమే కానీ పొత్తులు ఉండవని పలుమార్లు స్పష్టం చేశారు. ఇప్పుడు తాజాగా పార్టీ సీనియర్ నేత జానారెడ్డి మోదీ పాలనపై ప్రజలు గొంతు విప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. బిజెపిని వ్యతిరేకించే పార్టీలన్నీ కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలన్నారు. కాగా, పొత్తులపై జానారెడ్డి చేసిన వాక్యాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. పరోక్షంగా కాంగ్రెస్, బిఆర్ఎస్ కలుస్తాయనే విధంగా ఆయన వాక్యాలు ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
READ ALSO : RC 15 : ‘గేమ్ చేంజర్’ గా రామ్ చరణ్… ఆ టైటిల్ పెట్టడానికి కారణం ఇదే!